జాతీయ వార్తలు

1.68 లక్షల మందికి 10 సిజిపిఎ మార్కులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 28: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్‌ఇ) శనివారం విడుదల చేసిన పదో తరగతి పరీక్షల్లో దేశవ్యాప్తంగా 1,68,541 మంది విద్యార్థులు 10 సిజిపిఎ (క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్) మార్కులు సాధించారు. వీరిలో బాలురు 85,316 మంది ఉండగా, బాలికలు 83,225 మంది ఉన్నారు. నిరుడు 94,474 మంది విద్యార్థులు 10 సిజిపిఎ మార్కులు సాధించగా, వారిలో 49,392 మంది బాలురు, 45,082 మంది బాలికలు ఉన్నారు. 10 సిజిపిఎ మార్కులు సాధించిన వారిలో బాలికలకన్నా బాలురు ఎక్కువ మంది ఉన్నప్పటికీ, మొత్తం ఉత్తీర్ణులయిన వారిలో మాత్రం బాలురపై బాలికలు స్వల్ప ఆధిక్యతను సాధించారు.
ఇతర రీజియన్లతో పోలిస్తే తిరువనంతపురం ప్రాంతం ఉత్తీర్ణత శాతం అత్యంత ఎక్కువగా 99.87 శాతం ఉంది. 99.69 శాతంతో చెన్నై తరువాత స్థానాన్ని ఆక్రమించింది. కేంద్ర ప్రభుత్వం నడుపుతున్న జవహర్ నవోదయ విద్యాలయాలు (జెఎన్‌వి) 98.87 శాతం ఉత్తీర్ణతో మొదటి స్థానాన్ని ఆక్రమించాయి. 98.85 శాతం ఉత్తీర్ణతతో కేంద్రీయ విద్యాలయాలు (కెవి) రెండో స్థానంలో నిలిచాయి. ఇండిపెండెంట్ స్కూళ్లు 97.72 శాతం ఉతీర్ణత సాధించగా, ప్రభుత్వ పాఠశాలలు 86.61 శాతం ఉత్తీర్ణత సాధించాయి. సిబిఎస్‌ఇ గణాంకాల ప్రకారం ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల నుంచి 85.62 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
భారత సంతతి విద్యార్థి ప్రతిభ
సింగపూర్: సిబిఎస్‌ఇ 12వ తరగతి పరీక్షల్లో సింగపూర్‌లోని భారతీయ సంతతికి చెందిన విద్యార్థిని అనుష్క గైక్వాడ్ 98.2 శాతం మార్కులు సాధించడం ద్వారా ఆగ్నేయాసియాలో అగ్రస్థానంలో నిలిచారు. భారత్ వెలుపల సిబిఎస్‌ఇ సిలబస్‌ను బోధిస్తున్న గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ (జిఐఐఎస్)లో ఆమె చదివారు. భారత్ వెలుపల సిబిఎస్‌ఇ సిలబస్‌ను బోధిస్తున్న విద్యాసంస్థల్లో జిఐఐఎస్ అతిపెద్దది. అనుష్క తల్లిదండ్రులు ఉద్యోగ రీత్యా 2010లో సింగపూర్‌కు వచ్చారు. వారితోపాటు వచ్చిన అనుష్క సింగపూర్‌లో సిబిఎస్‌ఇ సిలబస్‌లో విద్యాభ్యాసం కొనసాగించారు. శుభం సరఫ్ అనే భారతీయ సంతతికి చెందిన మరో విద్యార్థి 98 శాతం మార్కులతో ఆగ్నేయాసియాలో రెండో స్థానంలో నిలిచారు.

చిత్రం సిబిఎస్‌ఇ పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థుల ఆనందహేల