జాతీయ వార్తలు

రాజ్యసభకు చిదంబరం, సిబల్, జైరాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 28: మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరంను కాంగ్రెస్ పార్టీ మహారాష్టన్రుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసింది. త్వరలో జరగబోయే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకోసం కాంగ్రెస్ పార్టీ 8 మంది అభ్యర్థులను శనివారం ప్రకటించింది. పార్టీ సీనియర్ నాయకులు ఆస్కార్ ఫెర్నాండెజ్, జైరాం రమేశ్‌లను కర్నాటకనుంచి, కపిల్ సిబల్‌ను ఉత్తరప్రదేశ్‌నుంచి అభ్యర్థులుగా ఎంపిక చేసింది. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి అంబికా సోనీని పంజాబ్‌నుంచి, చత్తీస్‌గఢ్‌నుంచి ఛాయా వర్మ, మధ్యప్రదేశ్‌నుంచి వివేక్ తన్ఖా, ఉత్తరాఖండ్‌నుంచి ప్రదీప్ తమ్టాలను అభ్యర్థులుగా ఎంపిక చేసింది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వీరిని ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 70 ఏళ్ల చిదంబరం 2014 లోక్‌సభ ఎన్నిల్లో పోటీచేయని విషయం తెలిసిందే. ఆయన కుమారుడు కార్తీ చిదంబరం ఆయన సొంత నియోజకవర్గమైన తమిళనాడులోని శివగంగనుంచి పోటీచేసి ఓడిపోయారు. ఎనిమిది మంది అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ పార్టీ కర్నాటకనుంచి మరో అభ్యర్థి ఎంపిక బాధ్యతను పార్టీ ప్రధాన కార్యదర్శి, పిసిసి అధ్యక్షుడు, సిఎల్‌పి నాయకుడి నిర్ణయానికి వదిలిపెట్టింది.
రాజ్యసభలోకి చిదంబరం, కపిల్ సిబల్‌ల రాకతోపాటుగా జైరాం రమేశ్‌ను తిరిగి నామినేట్ చేయడం వల్ల అధికార ఎన్డీయేకు మెజారిటీ లేని రాజ్యసభలో ప్రభుత్వంపై దాడికి మరింత బలం చేకూరుతుందనడంలో సందేహం లేదు. మహారాష్టన్రుంచి ఖాళీ అయిన ఏకైక స్థానానికి సుశీల్ కుమార్ షిండే, మాజీ ఎంపీ బాలచంద్ర ముంగేకర్‌సహా చాలామంది పార్టీ నేతలు పోటీ పడినప్పటికీ చిదంబరానికి ఆ అవకాశం కల్పించాలని అధిష్ఠానం నిర్ణయించింది. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి అవినాష్ పాండే ఆ రాష్ట్రంనుంచి రిటైరవుతున్నారు. వివేక్ తన్ఖా సీనియర్ న్యాయవాది కాగా, తమ్టా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్‌కు నమ్మినబంటు. వచ్చే ఏడాది పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా అంబికా సోనీని ఆ రాష్ట్రంనుంచి తిరిగి నామినేట్ చేస్తారన్న విషయం ఊహించిందే. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీకి ఆమె చైర్‌పర్సన్‌గా ఉన్నారు. కర్నాటకనుంచి తిరిగి నామినేట్ అయిన ఆస్కార్ ఫెర్నాండెజ్ నేషనల్ హెరాల్డ్ పత్రిక వ్యవహారాలు చూస్తున్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ బోర్డులో సభ్యుడు. కేంద్ర మాజీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయిన జైరాం రమేశ్ భూసేకరణ ఆర్డినెన్స్ బిల్లుపై ఎన్డీయే ప్రభుత్వంపైన, గుజరాత్ రాష్ట్ర పెట్రోలియం కార్పొరేషన్ కుంభకోణంపై ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ దాడిలో ముందున్న విషయం తెలిసిందే.