తెలంగాణ

ఢిల్లీలో పర్యటించిన మేయర్లు,అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,నవంబరు 17: దేశ రాజధానిలోని ఎన్‌డీఎంసీ పరిధిలో అమలవుతున్న సంక్షేమ కార్యకాలపాలను పరిశిలించేందుకు తెలంగాణ మేయర్లు,అధికారులు బృందం ఢిల్లీలో పర్యటించింది.్ఢల్లీ స్టడిటూర్‌లో భాగంగా తెలంగాణ భవన్‌లోని గురజాడ సమావేశం మందిరంలో న్యూఢిల్లీ మున్సిపాల్ కార్పొరేషన్ (ఎన్డీఎంసీ) ఉన్నతాధికారులు,తెలంగాణ రాష్టమ్రేయర్లు,ఉన్నతాధికారులు బృందానికి పవర్ పాయిట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.ఇందులో భాగంగా దేశ రాజధాని పరిధిలో ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛతా-పరిశుభ్రత,మొక్కలు పెంపకం,అత్యాదునిక హంగులతో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం వంటి తదితర అంశాలపై ఎన్డీఎంసీ ఉన్నతాధికారులు మెయర్లు,అధికారుల బృందానికి వివరించారు.
అనంతరం జీహెచ్‌ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్ విలేకరులతో మాట్లాడుతూ ఖమ్మం,కరీంనగర్,రామగుండం,నిజామాబాద్ మేయర్లు పాపాలాల్,రవీందర్‌సింగ్,లక్ష్మీనారాయణ,సుజాత శ్రీశైలం,జీహెచ్‌ఎంసీ కమిషనర్,జీహెచ్‌ఎంసి అధికారులు అన్నపూర్ణ దామోదరం తదితరులతో కలిసి ఢిల్లీలోని పలు ప్రాంతాలు పర్యటించామన్నారు.