జాతీయ వార్తలు

కాలుష్య నివారణకు మీరేం చేస్తున్నారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 17: ప్రమాదస్థాయిలో కాలుష్య వాతావరణం దాపురించినపుడు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో నివేదిక ఇవ్వాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) రాష్ట్రాలను ఆదేశించింది. చర్యల ప్రణాళిక అవసరాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని గట్టిగా సూచించింది. చర్యల ప్రణాళిక నివేదిక ఇవ్వడంలో రాష్ట్రాలు విఫలమైతే ఐదు లక్షల జరిమానా చెల్లించక తప్పదని హెచ్చరిస్తూ, ఆ జరిమానాను ఆయా రాష్ట్రాల్లో అత్యంత ఉన్నతస్థానంలోవున్న బాధ్యతకలిగిన అధికారి జీతం నుంచి వసూలు చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది.
ప్రమాద స్థితిని దాటి కాలుష్య పరిణామాలు రాష్ట్రాల్లో కనిపిస్తున్నాయంటూ కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు, ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీలు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో చర్యల నివారణా ప్రణాళికపై సీరియస్‌గా స్పందించాలని ఆదేశించింది. కోర్టు నిషేధాజ్ఞలు విధించినా ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో విస్తారంగా నిర్మాణాలు సాగుతోన్న వైనంపై సంబంధిత అధికారి సమాధానం ఇవ్వాలని కూడా ఎన్జీటీ ఆదేశించింది. కాలుష్యం ప్రమాదకర స్థితికి చేరినపుడు ఎవరి ఆదేశాల కోసమో ఎదురు చూడకుండా పాఠశాలలను స్వచ్ఛందంగా, కచ్చితంగా మూసివేయాలని కూడా గ్రీన్ కోర్టు సూచించింది. దుకాణాలకు ముందు భాగంలో రోడ్లపై వాహనాలు నిలుపుకునేందుకు అనుమతి ఇవ్వాలన్న సరోజినీనగర్‌లోని షాపు ఓనర్ల విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. ‘వాహనాలను మల్టీలెవెల్ కార్ పార్కింగ్ నెలకొల్పిన ప్రాంతాల్లోనే పెట్టుకోవాలి. రోడ్లపక్కన, మార్కెట్ ప్రాంతాల్లో పార్కింగ్‌ను క్షమించలేం. ఈ విషయంలో ఢిల్లీ పోలీస్, ఎస్‌డిఎంసిలు కఠినంగా వ్యవహరించాలి. నిబంధనలు ఉల్లంఘించిన వాళ్లకు చలాన్ మొత్తంకాకుండా, ఐదువేల రూపాయలు అదనంగా ఫైన్ వేయండి’ అని ఆదేశించింది. భారీ మొత్తాలు వెచ్చించి మల్టీ లెవెల్ పార్కింగ్ నిర్మాణాలు ఏర్పాటు చేసినా ఖాళీగా పడివున్నాయని, దుకాణ యజమానులు, కస్టమర్లు రోడ్లపైనే వాహనాలను పార్కింగ్ చేయడం వల్ల ట్రాఫిక్ జామ్‌లు సంభవిస్తున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. ‘్భరీగా నిధులు వెచ్చించి నిర్మించిన మల్టీ లెవెల్ పార్కింగ్ ప్రదేశాలు వృధాగా పడి ఉంటున్నాయి. వీటిపై అధికారులు దృష్టి పెట్టకపోవడం వల్ల కాలుష్య కారకులు అవుతున్నారు’ అంటూ కోర్టు గట్టిగా మందలించింది.