జాతీయ వార్తలు

డప్పు కొట్టి.. తాళం వేసి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మఫ్లంగ్, మే 28: మేఘాలయలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన శనివారం రెండోరోజు కూడా కొనసాగింది. పర్యాటక కేంద్రమైన మఫ్లంగ్ మోదీ గ్రామాన్ని సందర్శించారు. షిల్లాంగ్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. ప్రధాని రాక సందర్భంగా స్థానిక కళాకారులు అక్కడి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా నృత్యాలు, సంప్రదాయ సంగీతంతో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ప్రధాని సరదాగా వారి సంప్రదాయ డప్పు ‘కా బోమ్’ను కొద్దిసేపు వాయంచారని, కళాకారులతో మాట్లాడారని హిమా మఫ్లంగ్ ప్రధాన పూజారి ఎన్‌కె లింగ్డో చెప్పారు. అటవీ ప్రాంతమైన మఫ్లంగ్ అందమైన ప్రకృతి, రకరకాల పూలు, సీతాకోక చిలుకలతో పర్యాటకులను ఆకట్టుకునే రీతిలో ఉంటుంది.
రాష్ట్ర గవర్నర్ వి. షణ్ముగనాథన్, ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా, కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌తో కలిసి వచ్చిన ప్రధాని ఈ ప్రకృతి అందాలను స్థానికులు ఎలా పరిరక్షించుకుంటూ వస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. మఫ్లంగ్‌లో స్థానికులు అత్యంత పవిత్రమైనదిగా భావించే అటవీ ప్రాంతాన్ని ఆయన సందర్శించాల్సి ఉండింది. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో ఆ పర్యటన రద్దయింది. ప్రధాని స్థానిక కళాకారులతో ‘చాయ్ పే చర్చ’లో కూడా పాల్గొన్నారు. అంతకు ముందు ప్రధాని షిల్లాంగ్ పట్టణ శివార్లలోని మట్టిలంగ్ అమ్యూజ్‌మెంట్ పార్కును సందర్శించి, చుట్టూ ఉన్న పచ్చని ప్రకృతిని చూసి మురిసిపోయారని ప్రభుత్వ ఉన్నతాధికారి చెప్పారు. ఈశాన్య ప్రాంత అభివృద్ధి మండలి 65వ సమావేశంలో పాల్గొనడానికి రాష్ట్రానికి వచ్చిన ప్రధాని శుక్రవారం నగరంలో జరిగిన పౌర సన్మానంలో కూడా పాల్గొన్నారు.

చిత్రం మేఘాలయలోని మఫ్లంగ్ గ్రామాన్ని శనివారం సందర్శించిన ప్రధాని మోదీ అక్కడి కళాకారులతో మమేకమయ్యారు.
వారి సాంప్రదాయ వాద్యాలపై దరువు వేశారు. వారితో కలిసి టీ తాగారు. కళాకారులను తన కెమెరాలో బంధించారు