జాతీయ వార్తలు

లక్ష గ్రామాలకు రోడ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 17: ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజనను అమలు చేయటంలో విశిష్ట ప్రగతిని సాధించారు. ఈ పథకం కింద లక్షా నలభై ఐదు వేల గ్రామాలను రోడ్డు మార్గంతో కలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం రాత్రి దాదాపు రెండు గంటల పాటు కీలక, వౌలిక సదుపాయాల రంగాలైన పీఏంజీఎస్‌వై, గృహ నిర్మాణం, బొగ్గు, విద్యుత్ రంగాల పనితీరును సమీక్షించారు. నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పీఎంఓ సీనియర్ అధికారులు, నీతి ఆయోగ్ సీనియర్ అధికారులు, వౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు హాజరయ్యారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజనను అమలు చేయటంలో విశిష్ఠ ప్రగతిని సాధించినట్లు సమీక్షలో నిర్ధారించారు. దాదాపు 81 శాతం అంటే లక్షా 45 వేల గ్రామాలకు రోడ్లు వేసే లక్ష్యాన్ని సాధించారు. మిగతా 19 శాతం గ్రామాలకు కూడా త్వరలోనే రహదారి సౌకర్యం కల్పిస్తారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజనకు కేటాయించిన నిధులను సంవత్సరం పొడుగునా పూర్తిగా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా ప్రధాని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పార్లమెంటులో బడ్జెట్ ప్రతిపాదనను మరింత ముందుకు జరపటం వలన పీఎం గ్రామీణ సడక్ యోజనకు మరింత ప్రయోజనం కలుగుతుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ‘నా రోడ్డు యాప్’ ద్వారా గ్రామీణ రోడ్లకు సంబంధించి ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని అధికారులు ప్రధాన మంత్రికి తెలిపారు. అంతేకాకుండా ఆ ఫిర్యాదులపై లోతుగా అధ్యయనం చేసి సకాలంలో పరిష్కార చర్యలు తీసుకోవాలని మోదీ అధికారులకు సూచించారు.
అలాగే 2019 నాటికి కోటి గృహాలను లబ్ధిదారులకు అందజేసే పథకం అమలు తీరును కూడా నరేంద్ర మోదీ సమీక్షించారు. ‘గృహ సదుపాయం కల్పించడం వల్ల లబ్ధిదారుల జీవితాలపై పడుతున్న సహేతుక ప్రభావం గురించి అధ్యయనం చేయాలి. లబ్ధిదారుల జీవన ప్రమాణాల నాణ్యతను పెంచే దిశగా చర్యలు తీసుకోవాలి’ అని ఆయన ఆదేశించారు. భూగర్భ బొగ్గు నిక్షేపాలను వెలికి తీసేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నరేంద్ర మోదీ సంబంధిత అధికారులకు సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించటం ద్వారా బొగ్గు గ్యాసిఫికేషన్‌కు పెద్దపీట వేయాలని ప్రధాన మంత్రి సూచించారు. గ్రామీణ విద్యుదీకరణం, గృహాల విద్యుదీకరణ కార్యక్రమాలను కూడా ప్రధాని సమీక్షించారు.