జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో ఆరుగురు ఉగ్రవాదులు ఖతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, నవంబర్ 18: కాశ్మీర్‌లో భద్రతాదళాలు, ఉగ్రవాదులకు మధ్య శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు పాకిస్తానీ మిలిటెంట్లు హతమయ్యారు. హతమైన ఉగ్రవాదుల్లో 26/11 దాడుల సూత్రధారి జకీర్ రెహ్మాన్ లఖ్వీ మేనల్లుడితో పాటు లష్కర్-ఇ-తైబాకు చెందిన ఇద్దరు మిలిటెంట్లు ఉన్నారని జమ్మూ కాశ్మీర్ డిజిపి ఎస్‌పి వైద్ తెలిపారు. శనివారం ఉదయం ప్రారంభమైన ఈ ఎదురుకాల్పులు రాత్రి వరకూ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘటనలో భారత వాయుసేన ‘గరుడ్’ కమాండో ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు గాయపడ్డారు. బందిపొరా జిల్లా హజిన్ ప్రాంతంలోని చందర్‌గీర్ గ్రామాన్ని శనివారం ఉదయం భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఈ ప్రాంతంలో మిలిటెంట్ల కదలికలు ఉన్నట్లు సమాచారం అందడంతో అక్కడికి భద్రతా దళాలు చేరుకున్నాయి. సైనికులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఎదురుకాల్పులకు దారితీసింది. మరణించిన ఆరుగురు మిలిటెంట్లు పాకిస్తాన్‌కు చెందినవారే. మృతుల్లో ఒకరిని జకీర్ రెహ్మాన్ లఖ్వీ మేనల్లుడు ఓవైద్‌గా పోలీసులు గుర్తించారు. మరో ఇద్దరు మృతులను లష్కర్-ఇ-తేబాకు చెందిన జర్గామ్, మెహ్‌ముద్‌గా గుర్తించారు. ఉగ్రవాదులపై తాము జరిపిన ఈ ఆపరేషన్ విజయవంతమైనట్లు డిజిపి తెలిపారు. సంఘటన ప్రాంతంలో ఆరు మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వాయుసేన ‘గరుడ్’ కమాండో మృతి చెందగా మరో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. పాక్ మిలిటెంట్లు కొంతకాలంగా విధ్వంసక చర్యలకు పాల్పడుతున్నందున సాయుధ బలగాలు గాలింపు చర్యలను తీవ్రతరం చేశాయి.