జాతీయ వార్తలు

పద్మావతిపై ఆగని రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి/జైపూర్, నవంబర్ 18: సంజయ్ లీలా బన్సాలీ రూపొందించిన పద్మావతి చిత్రంపై తలెత్తిన వివాదం తారస్థాయికి చేరింది. కేంద్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తోందని, సమాచార ప్రసార మంత్రి స్మృతి ఇరానీ తక్షణం స్పందించాలని బాలీవుడ్ నటి షబానా ఆజ్మీ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (ఐఎఫ్‌ఎఫ్‌ఐ)ను బహిష్కరించాలని చలనచిత్రం వర్గాలకు పిలుపునిచ్చారు. మరోపక్క పద్మావతి చిత్రాన్ని నిషేధించాలంటూ రాజస్థాన్‌లో నిరసనలు కొనసాగుతున్నాయి. వందలాది మంది రాజ్‌పుట్‌లు కుంభాల్‌గఢ్ కోట రహదారులను దిగ్బంధనం చేశారు. శుక్రవారం చిత్తోడ్‌గఢ్ కోటవద్ద రాజుకున్న నిరసనలు కుంభాల్‌గఢ్‌కు పాకినట్టు ఓం ప్రకాష్ అనే పోలీసు అధికారి వెల్లడించారు. దీపికా పదుకొనే ప్రధాన పాత్రలో నటించిన పద్మావతి చిత్రంపై జరుగుతున్న దాడులపై కళలపై జరిగినట్టుగా భావించాల్సి వస్తుందని బాలీవుడ్ నటి షబానా ఆజ్మీ అన్నారు. కర్ణిసేన బెదిరింపులు ముమ్మాటికీ కళల విధ్వంసానికి జరుగుతున్న కుట్రలో భాగమేనని ఆమె విరుచుకుపడ్డారు. సంజయ్‌లీలా బన్సాలీ, పద్మావతికి సినీరంగం మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు. అంతర్జాతీయ చలన చిత్రోత్సవాన్ని బహిష్కరించాలంటూ ఆమె ట్వీట్ చేశారు. కాగా దీపికా పదుకోనే ముక్కు కోస్తామంటూ కర్ణిసేన బెదిరింపులకు దిగిన నేపథ్యంలో ముంబయి పోలీసులు ఆమెకు భద్రత పెంచారు. వెర్సోవాలోని బన్సాలీ ఇంటివద్ద భారీభద్రత కల్పించారు. ఇలాఉండగా 48వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు ఈ నెల 20 నుంచి వారం రోజులపాటు గోవాలో జరగనున్నాయి. రాజ్‌పుట్‌ల ఆందోళనల నేపథ్యంలో కుంభాల్‌గఢ్ కోటవద్ద భద్రత కల్పించారు. అక్కడ మెజిస్టిక్ హిల్ ఫోర్టు మహారాణ ప్రతాప్ సింగ్ జన్మస్థలం.
అలాగే యునెస్కో హెరిటేజ్ స్టేషన్ కూడా. పద్మావతి చిత్రాన్ని నిషేధించాలంటూ రాజస్థాన్ అంతటా ఆందోళనలు మిన్నంటాయి. శుక్రవారం చిత్తోడ్‌గఢ్ వద్ద సంజయ్ లీలా బన్సాలీ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. వాస్తవ చరిత్రను మరుగునపెట్టి పద్మావతి సినిమాను నిర్మించారని కర్ణిసేన ఆరోపిస్తోంది. దీపికా పదుకోనే, షాహిద్ కపూర్, రణ్‌వీర్ కపూర్ ఇందులో ప్రధాన తారాగణం.