జాతీయ వార్తలు

‘ధ్రువీకరణ’ లేకుండా ప్రదర్శనలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 18: సెన్సార్ ధ్రువీకరణ పత్రం లేకుండానే ‘పద్మావతి’ సినిమాను కొన్ని జాతీయ టీవీ చానళ్లలో ఎలా ప్రసారం చేస్తారని ‘సెంట్రల్ బోర్టు ఆఫ్ ఫిల్మ్ సర్ట్ఫికేషన్’ (సీబీఎఫ్‌సీ) చైర్మన్ ప్రసూన్ జోషీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది జర్నలిస్టులకోసం ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేసి ‘పద్మావతి’ నిర్మాతలు మరో వివాదంలో చిక్కుకున్నారంటూ వార్తలు రావడంతో జోషీ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. చరిత్రను వక్రీకరిస్తూ, ఓ వర్గం వారి మనోభావాలను దెబ్బతీసేలా ఈ సినిమాను నిర్మించారంటూ రాజస్థాన్ సహా పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సెన్సార్ ధ్రువీకరణ పత్రం కోసం దాఖలు చేసిన దరఖాస్తు అసంపూర్తిగా ఉన్నందున సంజయ్‌లీలా భన్సాలీ రూపొందించిన ‘పద్మావతి’ సినిమాను సిబీఎఫ్‌సీ వెనక్కిపంపిన మరుసటి రోజున జోషీ ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. తాము ఈ సినిమాను చూడకుండా, ధ్రువీకరణ పత్రం ఇవ్వకండా జర్నలిస్టులకోసం, జాతీయ చానళ్లకోసం ఎలా ప్రదర్శిస్తారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ‘వ్యవస్థలను, నిబంధనలను పట్టించుకోకుండా సినిమా పరిశ్రమ ఇలా వ్యవహరించడం సరికాదు..’ అని ఆయన పేర్కొన్నారు. సెన్సార్‌కోసం దాఖలు చేసిన దరఖాస్తు అసంపూర్తిగా ఉందన్న విషయాన్ని దర్శక, నిర్మాతలకు తాము ఇదివరకే తెలియజేశామన్నారు. సెన్సార్ పరిశీలనకు వారు చేసిన దరఖాస్తు ఈ వారంలోనే తమకు అందిందని, ధ్రువీకరణకు సంబంధించిన ప్రక్రియ పూర్తి కాలేదన్న విషయం కూడా వారికి తెలుసునని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమా ‘చారిత్రకమా’ లేక ‘కల్పనా’ అన్న విషయాన్ని దరఖాస్తులో పేర్కొనలేదన్నారు. సంబంధిత పత్రాలను సమర్పించలేదని, ధ్రువీకరణలో జాప్యం జరిగితే అందుకు సీబీఎఫ్‌సీదే బాధ్యత అన్నట్లు ప్రవర్తించడం తనకు విస్మయాన్ని కలిగించిందన్నారు. బాధ్యతాయుతంగా, పరస్పరం గౌరవించుకునే విధంగా, సంయమనంతో వ్యవహరించడం అవసరమన్నారు. కాగా, ‘పద్మావతి’ సినిమాను నిర్మించిన ‘వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్’ సిఓఓ అజిత్ అంధారే మాట్లాడుతూ, దరఖాస్తుకు సంబంధించిన వివాదం చాలా చిన్నదని, అది లేకుండానే సెన్సారింగ్ ప్రక్రియను పూర్తి చేయవచ్చని అన్నారు. ‘చిన్న సాంకేతిక అంశం’ వల్ల సినిమా భవితవ్యం ఇంకా సీబీఎఫ్‌సీ నిర్ణయంపైనే ఆధారపడి ఉందన్నారు. ఇదిలా ఉండగా, డిసెంబర్ 1న విడుదల ఈ సినిమాను విడుదల చేస్తే, ప్రదర్శనలను అడ్డుకుని తీరుతామని రాజస్థాన్‌లోని ‘కర్ణిసేన’ సహా అనేక సంస్థలు హెచ్చరించాయి. ‘పద్మావతి’ పాత్రలో నటించిన దీపికా పదుకొనె, ఇతర నటీనటులపై దాడులు చేస్తామని ఆ సంస్థలు ప్రకటించాయి.

చిత్రం.. ప్రసూన్ జోషీ