జాతీయ వార్తలు

రైలు పెట్టెల రంగు మారుతోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 19: రానున్న రోజుల్లో రైలు పెట్టెల రంగులు మారునున్నాయి. రైళ్ళ నిర్వహణలో కొత్తదనం ఉట్టిపడేలా, ప్రయాణికులను విశేషంగా ఆకర్షించే విధంగా రైలు పెట్టెల రంగులను సమూలంగా మార్పు చేయాలని రైల్వేశాఖ ఆలోచన చేస్తోంది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని దేశంలో ఉండే రైల్వేజోన్లు, డివిజన్లకు పంపినట్టు తెలిసింది. రైలు పెట్టెలకు కొత్త రంగు అద్దడం కోసం గత కొంతకాలంగా పెట్టెల తయారీ సైతం నిలిచిపోయింది. అదనపు కోచ్‌ల మంజూరుకు మోక్షం లభించడంలేదు. ఎలాగూ కొత్త రంగుతో కూడిన రైలు పెట్టెలను అందుబాటులోకి తీసుకువస్తున్నామనే భావనతోనే పాత రంగులతో కూడిన రైలు పెట్టెలను అందుబాటులోకి తీసుకురావడంలేదనేది స్పష్టమవుతోంది. దేశంలో ప్రముఖమైన ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో ఉండే ఖుర్దా, సంబల్‌పూర్, వాల్తేరు డివిజన్లకు సంబంధించి రైలు పెట్టెలు రావాల్సి ఉంది. కొత్త రైళ్ళు నిర్వహించాలన్నా, పండుగ, వేసవి సీజన్‌ల్లో ప్రత్యేక రైళ్ళ నిర్వహణకు కచ్చితంగా కొత్తగా రైలు పెట్టెలు మంజూరు చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ జోన్‌తోపాటు దేశవ్యాప్తంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలోపెట్టుకుని నడుస్తోన్న ఎక్స్‌ప్రెస్‌లకు అదనపు కోచ్‌లు కేటాయించాలి. దీనికి సంబంధించి ఆయా రైల్వేజోన్లు, డివిజన్ల నుంచి వెళ్ళే ప్రతిపాదనలుబట్టి ప్రతి ఏడాది కొన్ని పెట్టెలు మంజూరవుతుంటాయి. అయితే, ఈవిధంగా మంజూరయ్యే కొత్త పెట్టెల తయారీని సైతం నిలిపివేసినట్టు రైల్వేవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం నీలం రంగుతో కూడుకున్న రైలు పెట్టెల స్థానంలో ఎరుపు రంగును కలిగి ఉండే పెట్టెలను తయారీ చేసి వాటిని పట్టాలెక్కించాలనే లక్ష్యంతోనే పాత రంగులకు స్వస్తి పలుకుతున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ తరహా రైలు పెట్టెల తయారీకి కాస్తంత సమయం పట్టనుంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం నడుస్తోన్న రైళ్ళల్లో 60 నుంచి 70 శాతం మేర నీలం రంగుతో కూడుకున్న రైలు పెట్టెలే ఉండగా, మరికొంత మేర కొనే్నళ్ళ నాటి ఎరుపు రంగుతో కూడుకున్న రైలు పెట్టెలే దర్శనమిస్తున్నాయి. అయితే, కేంద్ర రైల్వేశాఖ మాజీ మంత్రి మమత బెనర్జీ హయాంలో నీలం రంగుపట్ల ఆమె చూపిన మమకారంతో చాలా రైళ్ళు నీలం రంగు పులుముకున్నాయి. అప్పట్లో ఎరుపురంగు తొలగింపు కార్యక్రమం జరిగింది. ఈ రంగును పూర్తిగా తొలగించడం సాధ్యపడలేదు. మళ్ళీ ఇపుడు ఎరుపు రంగుతో కూడిన సరికొత్త ప్రతిపాదనలను తెరమీదకు వస్తోంది. అయితే, ఇది ఎప్పటికీ సాధ్యపడుతుందనేది ఎదురు చూడాల్సిందే. కాగా, స్వచ్ఛ్భారత్‌లో భాగంగా పర్యావరణ పరిరక్షణ, అలాగే వృధాగా పడి ఉండే జనరల్ కోచ్‌ల టాయ్‌లెట్లను తొలగించి సామాన్యులకు చల్లదనం అందించే తరహాలో ‘ఎయర్ కూల్డ్ ప్లాంట్’లు ఏర్పాటు చేసేందుకు రైల్వే సన్నద్ధమవుతోంది. దీనికి సంబంధించి ప్రణాళికలకు రూపకల్పన చేస్తున్నట్టు తెలిసింది.