జాతీయ వార్తలు

కలుషిత రక్తంతో 2234మందికి ఎయిడ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 31: భారత దేశంలో కలుషిత రక్తాన్ని ఎక్కించటం వల్ల గత 17 నెలల్లో 2234 మందికి హెచ్ ఐ వీ వైరస్ సోకిందని హిందూ దినపత్రిక ఓ నివేదికను వెలువరించింది. ఉత్తర ప్రదేశ్‌లో అత్యధికంగా 361 కేసులు ఇలాంటివి నమోదయ్యాయని ఆ నివేదికలో పేర్కొన్నారు. గుజరాత్‌లో 292 కేసులో, మహారాష్టల్రో 272, ఢిల్లీలో 264 కేసులు నమోదయ్యా యి. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (నాకో)కు సమాచార హక్కు కార్యకర్త చేతన్ కొఠారీ దాఖలు చేసిన దరఖాస్తుకు సమాధానంగా ఈ సమాచారాన్ని నాకో వెల్లడించింది. బడ్జెట్ కోత వంటి కారణాల వల్ల ఎయిడ్స్‌పై చైతన్య కార్యక్రమాలను ప్రభుత్వం తగ్గించింది. ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. దీనిపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలి అని చేతన్ కొఠారీ అన్నారు. నాకో 2015 వార్షిక నివేదిక ప్రకారం దేశంలో 20.9లక్షల మంది ఎయిడ్స్/హెచ్‌ఐవీతో జీవిస్తున్నారు.