జాతీయ వార్తలు

‘ఎయిమ్స్’ అక్రమార్కులపై కేసులు ఎత్తేశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 21: ఢిల్లీలోని ‘అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ’ (ఎయిమ్స్)లో అక్రమాలకు పాల్పడ్డ సీనియర్ అధికారులపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ కేసులను మూసేసిందని రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, ఐఎఫ్‌ఎస్ అధికారి సంజీవ్ చతుర్వేది ఆరోపించారు. ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు కేంద్ర విజిలెన్స్ కమిషనర్ (సివిసి) కెవి చౌదరిపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన ఇటీవల వెయ్యి పేజీల డాక్యుమెంట్లను భారత రాష్టప్రతికి పంపారు. మొత్తం ఏడు కేసులకు సంబంధించిన సాక్ష్యాధారాలను చతుర్వేది రాష్టప్రతి కార్యాలయం అధికారులకు స్వయంగా అందజేశారు. తాను ఎయిమ్స్‌లో ప్రధాన నిఘా అధికారి (సివిఓ)గా పనిచేసినపుడు వేధింపులకు గురయ్యానని చతుర్వేది పేర్కొన్నారు. 2012 జూలై నుంచి 2014 ఆగస్టు వరకూ ఎయిమ్స్‌లో సివిఓగా పనిచేసినపుడు పలు కొంతమంది ఉన్నతాధికారుల అవినీతి గురించి కేంద్ర విజిలెన్స్ కమిషన్‌కు, సిబిఐకు తెలియజేశానని ఆయన తెలిపారు. ఆ ఆరోపణలపై విచారణ జరిపాక- నాలుగు కేసులకు సంబంధించి కొంతమంది అధికారులపైన, ఫాకల్టీ సభ్యులపైన చర్యలు తీసుకోవాలని సిబిఐ నివేదిక సమర్పించింది. సిబిఐ విచారించిన కేసులను కేంద్ర విజిలెన్స్ కమిషన్ మూసివేసినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా చతుర్వేది తెలుసుకున్నారు.
విజిలెన్స్ చట్టం ప్రకారం ఏదైనా సంస్థలో అవినీతి ఆరోపణలు వస్తే దర్యాప్తు జరపాలని సంబంధిత ముఖ్య నిఘా అధికారి (సివివో) ఆ కేసులను సిబిఐకి పంపుతారు. ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపాక సిబిఐ అధికారులు నివేదికలు ఇవ్వడం ఆనవాయితీ. ఈ నివేదికలపై ఎంతో గోప్యత పాటించాలి. అయితే, ఎయిమ్స్ అవినీతి వ్యవహారంలో ఎలాంటి నిబంధనలు పాటించలేదని, విజిలెన్స్ కమిషన్ అతిగా ప్రవర్తించిందని చతుర్వేది రాష్టప్రతి కార్యాలయానికి ఆర్టీఐ సమాచారం మేరకు అనేక పత్రాలను సమర్పించారు. ఎయిమ్స్‌లో ఏడువేల కోట్ల రూపాయల వ్యయంతో వివిధ సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు జరిగిన పనుల్లో ఇంజనీరింగ్ విభాగం అధిపతి బిఎస్ ఆనంద్ 2012లో పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆరపణలు వచ్చాయి. దీంతో బిఎస్ ఆనంద్‌పైన, ఎయిమ్స్ డిప్యూటీ డైరెక్టర్ వినీత్ చౌదరిపైన 2014లో సిబిఐ కేసులు పెట్టింది. వినీత్ చౌదరిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సిబిఐ ఒక నివేదికను 2014లోనే సమర్పించింది. అయితే, ఆ కేసును మూసివేయాలని 2016 జూలైలో కేంద్ర విజిలెన్స్ కమిషన్ నిర్ణయించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖకు బదులు ‘సిబ్బంది, శిక్షణ విభాగం మంత్రిత్వ శాఖ’ (డిఓపిటి) సిఫారసుల మేరకు విజిలెన్స్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. డెప్యుటేషన్‌పై ఉన్న ఐఎఎస్ అధికారులపై చర్యలకు డిఓపిటి మాత్రమే నిర్ణయాలు తీసుకోవల్సి ఉంటుంది. ఎయిమ్స్‌లో స్టోర్స్ అధికారులు, అప్పటి డైరెక్టర్ ఎంసీ మిశ్రా వల్ల కొన్ని అవకతవకలు జరిగాయని 2015 అక్టోబర్‌లో సిబిఐ మరో నివేదికను ఆరోగ్య మంత్రిత్వ శాఖకు అందజేసింది. అయినప్పటికీ నిందితులపై ఎలాంటి చర్యలూ తీసుకోకుండా కేసులను మూసివేశారని చతుర్వేది చెబుతున్నారు.