జాతీయ వార్తలు

మోదీ చక్రవర్తి కాదు.. ప్రధాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్‌బరేలీ, మే 31: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనను తాను షహన్‌షా(చక్రవర్తి)గా భావించుకుంటున్నారని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం ఆరోపించారు. తన లోక్‌సభ నియోజక వర్గం రాయ్‌బరేలీలో ఆమె విలేఖరులతో మాట్లాడారు. ‘ఇలాంటి పరిస్థితిని నేనెన్నడూ చూడలేదు. ఇక్కడ ప్రధానమంత్రి ఉంటారు.. చక్రవర్తి కాదు. ఆయన దేశానికి ప్రధానమంత్రి. దేశంలో తీవ్రమైన పేదరికం ఉంది. కరవు ఉంది.. రైతులు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ సమయంలో ఇలాంటి ప్రదర్శనలు(ఎన్డీఏ సర్కారు రెండేళ్ల సంబరాలు) సరైనవని నేను భావించటం లేదు’ అని సోనియా వ్యాఖ్యానించారు. తన అల్లుడు, ప్రియాంకగాంధీ భర్త రాబర్డ్ వాద్రాపై చేస్తున్న ఆరోపణలను సైతం ఆమె కొట్టిపారేశారు. కాంగ్రెస్ ముక్త భారత్ పేరుతో ఎన్డీయే చేస్తున్న కుట్రలో ఈ తప్పుడు ఆరోపణలు కూడా భాగమని ఆమె వ్యాఖ్యానించారు. సర్కారుకు ఏమాత్రం దమ్మున్నా నిష్పాక్షిక విచారణ జరిపించాలని.. అప్పుడే నిజం ఏమిటో బయటపడుతుందని ఆమె వ్యాఖ్యానించారు. రాబర్డ్ వాద్రాకు ఆయుధాల డీలర్ సంజయ్ భండారీతోసంబంధాలు ఉన్నాయని, ఆయుధాల విక్రయంతో వచ్చిన కమిషన్‌తో లండన్‌లో ఒక భవనాన్ని కొనుగోలు చేసి ఆ తరువాత విక్రయించారంటూ వచ్చిన వార్తలపై సోనియా గాంధీ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం దగ్గర ఏ చిన్న ఆధారం ఉన్నా పక్షపాతం లేకుండా దర్యాప్తు చేయించాలని సవాలు చేశారు. రాబర్ట్ వాద్రాకు లండన్‌లో బినామీ ఆస్తులున్నాయనే ఆరోపణను ఆమె తీవ్రంగా ఖండించారు. వాడ్రాపై వచ్చిన ఆరోపణలను కాంగ్రెస్‌పై జరుగుతున్న కుట్రలో భాగమంటూ సోనియా ఖండించటం ఇటీవలి కాలంలో రెండోసారి. రాబర్ట్ వాడ్రాపై వచ్చిన ఆరోపణలను సోనియా గాందీ ఖండించటంతోపాటు కాంగ్రెస్ నేతలు కూడా ప్రభుత్వాన్ని విమర్శించటం తెలిసిందే. రాబర్ట్ వాడ్రాపై ఆరోపణలు చేయటం అంటే కాంగ్రెస్‌పై చేసినట్లేననే విధంగా సోనియా వ్యవహరించటం గమనార్హం.
బీజేపీ ఖండన
ప్రధాన మంత్రి మోదీపై సోనియా చేసిన ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. పార్టీ సీనియర్ నాయకుడు షానవాజ్ హుస్సేన్, పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా తదితరులు మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ప్రధానిని చక్రవర్తి అంటూ వెటకరించటం సోనియాకు ఎంత మాత్రం తగదని స్పష్టం చేశారు.

చిత్రం తన నియోజకవర్గమైన రాయ్‌బరేలీలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ