జాతీయ వార్తలు

కాంగ్రెస్‌లో కొత్త ఆశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 22: పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి ఆధ్యక్షుడు హార్దిక్ పటేల్‌తో సీట్ల సర్దుబాటు కుదరటంతో కాంగ్రెస్‌లో కొత్త ఆశలు చిగురించాయి. పటేల్ వర్గాన్ని బీసీల జాబితాలో చేర్చే అంశంపై బహిరంగంగా హామీ ఇవ్వకుండానే హార్దిక్ పటేల్‌ను దారికి తీసుకురాగలిగినందుకు కాంగ్రెస్ వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసేందుకు హార్దిక్ పటేల్ సిద్ధమైనందుకు ధన్యవాదాలంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ విలేఖరుల సమావేశంలో ప్రకటించారు. అయితే కాంగ్రెస్‌కు చెందిన ఒక వర్గం మాత్రం పటేల్ వర్గం వలన పార్టీకి ఒరిగేదేమీ లేదని వాదిస్తోంది. పటేల్ వర్గాన్ని బీసీల జాబితాలో చేర్చే అంశంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టమైన హామీ ఇవ్వకపోయినా హార్దిక్ పటేల్ ఆయనతో చేతులు కలపడంపట్ల పటేల్ వర్గం ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ కూడా బీజేపీ లాంటిదేనని దుయ్యబట్టిన కొన్ని గంటలకే హార్దిక్ పటేల్ కాంగ్రెస్‌తో చేతులు కలుపుతున్నట్లు ప్రకటించటం పలు అనుమానాలకు దారితీస్తోందని బీజేపీకి చెందిన పటేల్ వర్గం నాయకులు చెబుతున్నారు. హార్దిక్ పటేల్ ఆఖరు క్షణంలో కాంగ్రెస్‌కు లొంగిపోయారని వారు ఆరోపిస్తున్నారు. పటేల్ వర్గాన్ని బీసీల జాబితాలో చేర్చేందుకు అంగీకరిస్తూ బహిరంగ ప్రకటన చేస్తే రాష్ట్రంలోని 54 మంది వెనుకబడిన కులాలవారు కాంగ్రెస్‌కు దూరం కావటంతోపాటు ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన బీసీ నాయకుడు జిగ్నేష్ కూడా దూరమయ్యే ప్రమాదం ఉంది. అందుకే రాహుల్ పటేల్ వర్గాన్ని బీసీ జాబితాలో చేర్చే అంశంపై బహిరంగంగా హామీ ఇచ్చేందుకు తిరస్కరించారు. రాహుల్ ఈ విషయాన్ని హార్దిక్ పటేల్‌కు స్పష్టం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏదోఒక రంగంగా పటేల్ వర్గాన్ని బీసీల జాబితాలో చేర్చేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే హార్దిక్ పటేల్ ఈ అనధికార హామీతో సంతృప్తి చెందేందుకు మొదట తిరస్కరించినా చివరకు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చేందుకు అంగీకరించారని అంటున్నారు.
కాంగ్రెస్‌తో చేతులు కలపటం ద్వారా పటేల్ వర్గం రాజకీయ ప్రయోజనాలను హార్దిక్ దెబ్బతీశారని బీజేపీ ఆరోపించింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత పటేల్ వర్గాన్ని బీసీల జాబితాలో చేర్చే అంశాన్ని పరిశీలిస్తామంటూ కాంగ్రెస్ అనధికారికంగా ఇస్తున్న హామీ ఎంతమాత్రం చెల్లదని రాష్ట్ర బీజేపీ నాయకులు చెబుతున్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు యాభై శాతం మించేందుకు వీలులేదు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత పటేల్ వర్గాన్ని బీసీల జాబితాలో ఎలా చేరుస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. హార్దిక్ పటేల్ కాంగ్రెస్‌కు అమ్ముడుపోయారనే విషయాన్ని రాష్టమ్రంటతా ప్రచారం చేస్తామని బీజేపీ నాయకులు చెబుతున్నారు.