జాతీయ వార్తలు

అగ్నికీలల ధాటికి భీతిల్లిన జనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుల్‌గావ్, మే 31: మహారాష్టల్రోని పుల్‌గావ్ ఆయుధగారంలో జరిగిన పేలుళ్ల శబ్దానికి చుట్టుపక్కలంతా దద్దరిల్లిపోయింది. సమీప గ్రామాల్లోని ఇళ్లు ఊగిపోయాంటే ధాటి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఆయుధగారంలో జరిగిన అగ్నిప్రమాదంలో 18మంది భద్రతా సిబ్బంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. భూకంప వస్తే ఎలా ఉంటుందో అలాంటి భయానక పరిస్థితి చూశామని గ్రామస్తులు తెలిపారు. ఇళ్ల కిటికీలు, తలుపులు పెద్ద ఎత్తున ఊగడంతో ఏం జరుగుతుందోనన్న భయంతో బయటకు పరుగులు తీశారు. డిపో నుంచి అగ్నికీలలు ఎగిసిపడడంతో దట్టమైన పొగ గ్రామాలను కప్పేసింది. అల్మారాల్లోని వస్తువులు, సామాన్లు కింద పడిపోవడంతో భయపడ్డ తాము పరుగులు తీశామని ప్రవీణ్ సావార్కర్ చెప్పాడు. ప్రవీణ్, అతడి భార్య, వృద్ధురాలైన తల్లిని తీసుకుని బయటకు వచ్చేశారు. ఆయుధగారంలో గతంలోనూ స్వల్ప ప్రమాదాలు జరిగాయి. అయితే ఇంత ఉపద్రం ఎప్పుడూ చూడలేదని గ్రామస్తులు చెప్పారు. పుల్‌గావ్‌లో ఉన్నది ఆసియాలోనే అతిపెద్ద కేంద్ర ఆయుధగారం. 1989, 1995లో ఈ తరహా ప్రమాదాలు జరిగినా ప్రాణనష్టం జరగలేదు. అయితే కోట్లాది రూపాయల ఆస్తినష్టం వాటిల్లింది. ఆయుధగారంలో అగ్ని ప్రమాదంతో ఆగర్‌గావ్, పిప్రి, నాచన్‌గావ్, మగేజ్‌హరి గ్రామాల ప్రజలు షాక్‌కు గురయ్యారు. మగేజ్‌హరి డిపోకు సమీపంలోనే ఉంది. గ్రామ జనాభా 1500. నాచన్‌గావ్‌లో 2.500, ఆగర్‌గావ్‌లో 3,500, పిప్రిలో 800 మంది నివిస్తున్నారు. డిపోనుంచి ఎగిసిపడుతున్న మంటలు, శబ్దాలను చూసిన గ్రామస్తులంతా ఇళ్లు వదలేసి బయకటు వచ్చేశారని ఓ యువకుడు తెలిపాడు. పరిస్థితి చక్కబడేవరకూ అక్కడే గడిపారన్నాడు. కాగా ప్రమాద వార్త తెలిసిన వెంటనే అధికారులు, ఫైర్ సిబ్బంది, పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే మంటలు వాటి నుంచి వచ్చే పేలుళ్లకు భారీ ఎత్తున వాహనాలు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక వాహనం కూడా బూడిదయింది. నాగ్‌పూర్ రేంజ్ డిఐజి రవీంద్ర కదం తన సిబ్బందితో ఆయుధగారానికి చేరుకున్నప్పటికీ డిపో కాంప్లెక్స్‌లోకి అనుమతించలేదు. తరువాత సావంగీ మేఘే ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు.

చిత్రం మహారాష్టల్రోని పుల్‌గావ్ జిల్లాలో ఓ ఆయుధ డిపోలో భీకరంగా చేలరేగుతున్న మంటలు