జాతీయ వార్తలు

శాంతితోనే అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, నవంబర్ 22: శాంతి, సామరస్యత లేనిదే సమాజంలో అభివృద్ధి లేదని, సత్యం, ధర్మం, శాంతి, ప్రేమను ప్రబోధించి సమాజాన్ని ప్రశాంతమార్గంలో నడిపించిన సత్యసాయిబాబా ఆశయాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని భారత ఉపరాష్టప్రతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. పుట్టపర్తి సత్యసాయిబాబా 92వ జయంతి ఉత్సవాల్లో భాగంగా బుధవారం ప్రశాంతినిలయంలోని సాయి కుల్వంత్‌హాల్‌లో నిర్వహించిన వేడుకల్లో ఉప రాష్టప్రతి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మానవసేవే మాధవసేవ అని, పురాతనకాలం నుంచి పురాణేతిహాలు, ఆధ్మాత్మిక గురువులు ప్రజలకు సేవలందించారన్నారు. అదే మార్గంలో నడిచిన మానవతావాది శ్రీసత్యసాయిబాబా అని కొనియాడారు. సర్వ ధర్మ సమభావనే తన జీవితధ్యేయంగా ప్రజలకు విద్య, వైద్యం, తాగునీరు అందించారన్నారు. సామాజికసేవ, మానవతావిలువల్ని ప్రపంచానికి చాటి చెప్పిన విశ్వగురువు సత్యసాయిబాబా అని శ్లాఘించారు. ఒక ప్రాంతానికి, మతానికి, కులానికి పరిమితం కాకుండా విశ్వవ్యాప్తంగా తన ప్రబోధాల ద్వారా సర్వ ధర్మ సమభావనను చాటిచెప్పిన గొప్ప ఆధ్యాత్మికవేత్త అని కొనియాడారు. సంస్కృతి జాతి నడవడికను ప్రతిబింబిస్తుందన్నారు. మానవత, సమానత, ప్రేమ, అహింస పాటిస్తూ సాటిమనిషి సేవే మానవ సంప్రదాయంగా అనుసరించాలని అభిలషించారు. భౌతికంగా సాయిబాబా లేకపోయినప్పటికీ ఆయన చేసిన సేవాకార్యక్రమాల్ని సత్యసాయి ట్రస్టు ద్వారా కొనసాగిస్తుండటం అభినందనీయమన్నారు. ఒకరి వద్ద నుంచి ముద్ద(్భజనం) లాక్కుని తినడం దానవత్వం.. మన వద్ద ఉన్నదేదో పెట్టడం మానవత్వం అని అన్నారు. విద్యార్థులు మానవతా విలువల్ని పాటిస్తూ ముందడుగు వేయాలని సూచించారు. శ్రమ (కష్టపడి పని చేయడం), సత్ప్రవర్తన, జాలి గుణాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్నారు. కుగ్రామమైన పుట్టపర్తిలో జన్మించిన సత్యసాయిబాబా గొప్ప ఆధ్యాత్మికవేత్తగా ఎదిగడం వల్లే ఈ ప్రాంతానికి ప్రపంచపటంలో ప్రముఖస్థానం దక్కిందని కొనియాడారు. అనంతపురం జిల్లాలో 118 గ్రామాలతో పాటు చెన్నై, మహబూబ్‌నగర్, నెల్లూరు తదితర ప్రాంతాలకు తాగునీరు అందించిన ఘనత సత్యసాయిదేనన్నారు. అలాగే 25 లక్షల మంది హృద్రోగులకు ఉచితంగా శస్తచ్రికిత్సలు చేసి కాపాడారన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయిసంస్థల ద్వారా విలువలు, క్రమశిక్షణతో కూడిన విద్య అందిస్తుండటం అభినందనీయమన్నారు.
గతంలో తాను బీజేపీ సీనియర్ నేత ఎల్‌కె అద్వానీతో కలిసి సత్యసాయిబాబా దర్శనార్థం పుట్టపర్తి వచ్చానని వెంకయ్య గుర్తుచేసుకున్నారు. అప్పట్లో నీ ఆరోగ్యం ఎలా ఉంది అంటూ బాబా తనను అడిగారని, అప్పటికే తాను అనారోగ్యంతో ఉన్నానని, ఆ విషయం బాబాకెలా తెలిసిందో ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు. భారతీయ సంస్కృతి చాలా గొప్పదని, ఆకలితో ఉన్న వారికి ఆహారాన్ని అందించి ఆదుకోవడం మన సంస్కృతిలో భాగమని ఉప రాష్టప్రతి పేర్కొన్నారు. చెట్టు, పుట్ట, పశుపక్ష్యాదుల్ని పూజించే గొప్పతనం మన భారతీయ సంస్కృతిలో ఇమిడి ఉందని అన్నారు. ఈరోజు ప్రారంభించిన సత్యసాయి ఆర్కేవ్స్‌లో బాబా లేఖలు, టేపులు, ఫొటోలు, వీడియోలు, ఫిలింలు, ప్రబోధాలు భవిష్యత్ తరాలకు అందించేలా అంతర్జాతీయ స్థాయిలో అందుబాటులో ఉంచారన్నారు. దీనికి ట్రస్టుసభ్యులు, శాస్తవ్రేత్తలు, సాంకేతిక నిపుణులు చేసిన కృషిని అభినందిస్తున్నానని అన్నారు. కార్యక్రమంలో మంత్రి కాలవ శ్రీనివాసులు, చీఫ్‌విప్ పల్లె రఘునాథరెడ్డి, హిందూపురం ఎంపి నిమ్మల కిష్టప్ప, జడ్పీచైర్మన్ పూల నాగరాజు, జెసీ టి.రమామణి, డిఐజి ప్రభాకరరావు, ఎస్పీ జివిజి అశోక్‌కమార్, సత్యసాయి సెంట్రల్ ట్రస్టు కార్యదర్శి చక్రవర్తి, సభ్యులు రత్నాకర్, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.