జాతీయ వార్తలు

లిబియాలో రాకెట్ దాడి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/కొచ్చి, మార్చి 26: హింసాకాండతో అట్టుడుకుతున్న లిబియాలోని జవియా నగరంలో జరిగిన రాకెట్ దాడిలో కేరళకు చెందిన సును సత్యన్ అనే నర్సుతోపాటు ఏడాదిన్నర వయసున్న ఆమె కుమారుడు ప్రణవ్ దుర్మరణం పాలయ్యారు. లిబియా రాజధాని ట్రిపోలీకి 45 కిలోమీటర్ల దూరంలోని జవియాలో శుక్రవారం సాయంత్రం దాదాపు 4 గంటలకు ఈ ఘటన జరిగిందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ వెల్లడించారు. సును సత్యన్ కుటుంబం నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌ను శుక్రవారం సాయంత్రం 4 గంటలకు రాకెట్ ఢీకొనడంతో ఆమెతో పాటు ఆమె కుమారుడు ప్రణవ్ మృతిచెందారని ‘ట్విట్టర్’లో సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. ప్రస్తుతం సును సత్యన్ భర్త విపిన్ కుమార్‌తో టచ్‌లో ఉన్నామని, జవియాలోని ఆసుపత్రిలో మరో 26 మంది భారతీయులు పనిచేస్తున్నారని ఆమె తెలిపారు. కాగా, పేలుడు సంభవించిన సమయంలో సును సత్యన్, ప్రణవ్ తమ ఇంటిలో నిద్రిస్తున్నారని ఆమె తండ్రి సత్యన్ నాయర్ తెలిపారు. ప్రస్తుతం ఆయన కొట్టాయం జిల్లాలోని కొందదులో ఉంటున్నారు. జవియా మెడికల్ సెంటర్‌లో సును సత్యన్ నర్సుగా పనిచేస్తుండగా, ఆమె భర్త విపిన్ కూడా లిబియాలోనే నర్సుగా పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో విపిన్ ఇంటికి దూరంగా ఉన్నప్పుడు వారి అపార్ట్‌మెంట్‌పై రాకెట్ దాడి జరిగింది. దీంతో లిబియాలో ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాల నుంచి భారతీయులంతా సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోవాలని సుష్మా స్వరాజ్ మరోసారి తాజాగా విజ్ఞప్తి చేశారు.