జాతీయ వార్తలు

ఉగ్రవాదులపై దాడులు ఆగవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, డిసెంబర్ 5: కాశ్మీర్‌లో ఉగ్రవాదుల అణచివేతకు ప్రారంభించిన ‘ఆపరేషన్లు’ ఇంకా కొనసాగుతాయని ఆర్మీ అధిపతి జనరల్ బిపిన్ రావత్ మంగళవారం స్పష్టం చేశారు. ఈ ‘ఆపరేషన్లు’ ఎంతకాలం కొనసాగుతాయన్నది ‘పొరుగు దేశం’ (పాకిస్తాన్) వైఖరిపై ఆధారపడి ఉంటుందన్నారు. కాశ్మీర్‌లో ఉగ్రవాదులపై తమ ‘చర్యలు’ కొనసాగుతున్నందున అక్కడి పరిస్థితి ఎంతో మెరుగుపడిందన్నారు.
రాజస్థాన్‌లోని సూరత్‌గఢ్ మిలటరీ కేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో రావత్ మాట్లాడారు. ఈ ఏడాది జమ్ము-కాశ్మీర్‌లో దాదాపు వందమంది ఉగ్రవాదులను భారతీయ ఆర్మీ అంతం చేసిందని, 2010 తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను నిర్మూలించడం గొప్ప విశేషమని ఆయన వివరించారు.