జాతీయ వార్తలు

అనుసంధానమే ఆదామార్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: దేశంలో నదుల అనుసంధానంతో జల సంపద ఆదా అవుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. దేశంలో పవర్ గ్రిడ్ మాదిరిగానే నదుల అనుసంధానం సాగాలన్నారు. దేశంలో జల వనరులకు ఎలాంటి ఇబ్బందీ లేదని, అయితే వినియోగం, నిర్వహణ పట్ల ప్రజలు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. జలాల యాజమాన్య నిర్వహణలో ఉత్తమ పద్ధతులు అవలంబించకుంటే, 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న ప్రభుత్వం ఆశయం నెరవేరే అవకాశం ఉండదని హెచ్చరించారు. డ్రిప్, పైప్ ఇరిగేషన్ విధానాలను రైతులు విస్తృతం చేస్తే సాగు వ్యయ నియంత్రణతోపాటు, జలాల ఆదా సాధ్యమని గడ్కరీ సూచించారు. తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ పంట దిగుబడి సాధించే ఉత్తమ సాంకేతిక విధానాలను రైతాంగం అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. నదుల అనుసంధాన కార్యక్రమంతో తమిళనాడు, కర్నాటక, తెలంగాణ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో నీటి కొరతను అధిగమించవచ్చని సూచించారు. ‘ఇండియా వాటర్ ఇంపాక్ట్-2017’ సదస్సులో కేంద్ర మంత్రి గడ్కరీ ఈ మేరకు సూచనలు చేశారు. కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి ఉమాభారతి మాట్లాడుతూ ప్రభుత్వ చర్యలతోపాటు, స్థానికుల సంకల్ప బలం కలిస్తేనే గంగా ప్రక్షాళన విజయవంతం అవుతుందని పిలుపునిచ్చారు. గంగా ప్రక్షాళనకు సంబంధించి ఇప్పటి వరకూ చర్చలు, సంప్రదింపులే సాగాయని, ఇక చర్యలు మొదలుపెట్టే సమయం ఆసన్నమైందని, ఫలితాల దిశగా అడుగులు పడాలని పిలుపునిచ్చారు. 2018 అక్టోబర్ నాటికి గంగా ప్రక్షాళనలో భాగమైన అన్ని ప్రాజెక్టులూ మొదలవ్వాలని ఆకాంక్షించారు. దేశంలో తగ్గిపోతున్న భూగర్భ జలమట్టంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని భూగర్భ జలవనరుల శాఖ కార్యదర్శి యూపీ సింగ్ హెచ్చరించారు. ఇటీవలి అధ్యయనాలను పరిశీలిస్తే, భూగర్భ జలాల మట్టం ప్రమాదస్థితి కంటే కిందికి దిగిజారినట్టు తెలుస్తోందని, భూగర్భ జల సంపదను మెరుగుపర్చుకునే చర్యలూ మృగ్యమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘విజన్ గంగా’ పేరిట రూపొందించిన ఒక డాక్యుమెంట్‌ను మంత్రులు విడుదల చేశారు.

చిత్రం..ఇండియా వాటర్ ఇంపాక్ట్ సదస్సు వేదికపై ‘విజన్ గంగా’ డాక్యుమెంట్‌ను విడుదల చేస్తున్న
కేంద్ర మంత్రి గడ్కరి. చిత్రంలో కేంద్ర మంత్రి ఉమాభారతి, క్లీన్ గంగా మిషన్ డైరెక్టర్ యూపీ సింగ్