జాతీయ వార్తలు

ప్రచారానికి ‘ఓఖి’ దెబ్బ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, డిసెంబర్ 5: హోరాహోరీగా సాగుతున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ‘ఓఖి’ తుపాన్ తీవ్ర ఆటంకంగా మారింది. అరేబియా సముద్ర తీరప్రాంతంలో తీవ్రమైన చలిగాలు వీస్తున్నాయి. గజగజ లాడిస్తున్న వాతావరణం మధ్య మంగళవారం ఎన్నికల ప్రచారం సాగలేదు. అన్ని ప్రధాన పార్టీల నాయకుల సభలు, ర్యాలీలు రద్దయ్యాయి. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎన్నికల సభలు రద్దయ్యాయి.
కాగా తుపాన్‌తో నష్టపోయిన ప్రజలను ఆదుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ బిజెపి శ్రేణులకు పిలుపునిచ్చారు. అమిత్‌షా సభలు అమ్రేలీలోని రాజుల, మహువ, షిహోర్‌లో జరగాల్సి ఉంది. అలాగే రాహుల్ గాంధీ ఎన్నికల ర్యాలీ అంజార్‌లో జరగాల్సి ఉండగా రద్దయింది. అలాగే మోర్బీ,్ధరంగధార, సురేంద్రనగర్ సభలు ఆగిపోయాయి. మంగళవారం ఉదయం నుంచే వర్షం పడుతుండడంతో అహ్మదాబాద్‌లోని బాపూనగర్‌లో జరగాల్సి ఉన్న బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ రోడ్‌షో రద్దయింది. సూరత్‌లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, రాజస్థాన్ సీఎం వసుంధర రాజే ప్రెస్ కాన్ఫరెన్స్‌లు రద్దయినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మాజీ కాంగ్రెస్ సీనియర్ నేత, జన వికల్ప్ ప్రంట్ చీఫ్ శంకర్ సిన్హా వాఘేలా రోడ్‌షోపైనా ఓఖి ప్రభావం పడింది.
అరేబియా సముద్రంలో ఏర్పడ్డ ఓఖి తుపాన్ సూరత్‌కు దక్షిణంగా 390 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

చిత్రం..ఓఖి తుపాను తీవ్రతకు ముంబయలోని మెరైన్ డ్రైవ్ వద్ద ఎగసిపడుతున్న అలలు