జాతీయ వార్తలు

కారులో మహిళను బంధించి.. ఓలా డ్రైవర్ లైంగిక దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, డిసెంబర్ 6: మహిళా ప్రయాణీకురాలిని కారులో బంధించి, ఆమెపై ఓలా డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన బెంగళూరులో జరిగింది. బాధితురాలు ఫిర్యాదు చేశాక ఈ ఉదంతం మూడు రోజుల ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటన ఆదివారం రాత్రి పదిన్నర గంటల సమయంలో నగరంలోని రింగ్‌రోడ్డులో జరిగిందని బాధితురాలైన 23 ఏళ్ల ఫ్యాషన్ డిజైనర్ పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఆమె కథనం ప్రకారం, ఓలా టాక్సీ డ్రైవర్ రాజశేఖర రెడ్డి కారు తలుపులకు తాళం వేసి లైంగిక దాడికి యత్నించాడు. ఆమె గట్టిగా కేకలు వేస్తూ కారు అద్దాలను బద్దలు కొట్టేందుకు యత్నించింది. ఆ సమయంలో రోడ్డుపై జన సంచారం లేదని, ఆకస్మికంగా తన కాళ్లను తాకుతూ డ్రైవర్ అసభ్యకరంగా ప్రవర్తించాడని, వెంటనే తాను ప్రతిఘటిస్తూ కారు అద్దాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నాంచానని ఆమె వివరించింది. దీంతో అతను తనను విడిచిపెట్టాడని, ఎవరికీ ఫిర్యాదు చేయవద్దని బెదిరించాడని ఆమె తెలిపింది. కాగా, లైంగిక దాడికి యత్నించిన డ్రైవర్‌ను విధుల నుంచి తొలగించామని, ఈ ఘటన పట్ల తాము క్షమాపణలు చెబుతున్నట్లు ‘ఓలా’ ప్రతినిధి తెలిపారు. వినియోగదారుల భద్రతకు తాము ప్రాధాన్యత ఇస్తామని, నిందితుడిపై సమగ్ర విచారణ జరిపేందుకు సహకరిస్తామని ఆయన తెలిపారు. కాగా, నిందితుడిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. డ్రైవర్‌ను కఠినంగా శిక్షించాలని ఓలా సంస్థకు ఆమె విజ్ఞప్తిచేసింది.