జాతీయ వార్తలు

ఎన్నికలే ఆయన్ను నేతను చేశాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 6: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రాహుల్ గాంధీని నాయకుడిని చేశాయని శివసేన అభివర్ణించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఆలయ సందర్శనలు చేపట్టడం హిందుత్వ విజయంగా పేర్కొంది. ఈ పరిస్థితిని బీజేపీ ఆహ్వానించక తప్పదని వ్యాఖ్యానించింది. శనివారం తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న గుజరాత్‌లో రాహుల్ గాంధీ విస్తృత ప్రచారం నిర్వహించడం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుజరాత్‌లోని ఎన్నో ఆలయాలను రాహుల్ సందర్శించడం, ప్రత్యర్థి పార్టీ బీజేపీ ప్రచారం చేసుకుంటున్న హిందుత్వ కార్డుకు కౌంటర్ వంటిదేనని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. ‘కచ్చితంగా విజయం సాధిస్తామని భావిస్తున్న బీజేపీ, విస్తృత ప్రచారంతో అలసిపోయినట్టు కనిపిస్తున్న నరేంద్రమోదీ.. రాహుల్ గాంధీ నాయకుడేనన్న విషయం అంగీకరించక తప్పని పరిస్థితిని ఎన్నికలు కల్పించాయి’ అంటూ సామ్న పత్రిక సంపాదకీయంలో శివసేన ప్రస్తావించింది. ‘రాహుల్ గాంధీ పప్పు కాదు, నాయకుడేనన్న విషయాన్ని ఎన్నికలు రుజువు చేస్తున్నాయి. ఈ విషయాన్ని అంగీకరించడానికి బీజేపీకి పెద్ద మనసు కావాలి’ అంటూ ఒకప్పటి సుదీర్ఘ మిత్రపక్షమైన బీజేపీకి చురకలు అంటించింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోందన్న బీజేపీ వ్యాఖ్యలను గుర్తుచేస్తూనే ‘మీరు కృత్రిమంగా కమ్మేసిన మసక చీకట్లను తొలగించుకుని వెలుతురు వైపు అడుగులేయడానికి రాహుల్‌కు మార్గం లేకపోలేదు’ అని గుర్తుచేసింది. ‘ఆలయాలను సందర్శించి రాహుల్ ప్రార్థనలు జరపడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నిజానికి ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ఆయన ఆలయ సందర్శనలు హిందూత్వ విజయంగా భావించాలి. బోగస్ సెక్యులరిజాన్ని పక్కనపెట్టి, కాంగ్రెస్‌ను హిందూత్వవైపు నడిపించడమే నిజమైతే ఆరెస్సెస్ సైతం ఆహ్వానం పలకాలి’ అని సంపాదకీయంలో పేర్కొంది.