జాతీయ వార్తలు

ఆ శిశువు నిజంగానే మరణించింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: సరైన ఎదుగుదల లేకుండా వారం రోజుల క్రితం జన్మించిన శిశువు ప్రసవ సమయంలోనే మరణించినట్లు వైద్యులు పొరపాటున ప్రకటించగా, చికిత్స పొందుతూ ఆ శిశువు బుధవారం నిజంగానే మరణించింది. ఈ ఉదంతం దేశ రాజధానిలోని మాక్స్ ఆస్పత్రిలో జరిగింది. గత నెల 30వ తేదీన తమ ఆస్పత్రిలో జన్మించిన శిశువు వారం రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఆ ఆస్పత్రి వర్గాలు బుధవారం తెలిపాయి. ఎదుగుదల లేని 23 వారాల శిశువు మరణించినట్లు తొలుత పొరపాటున ప్రకటించామని, అయితే ఆ తర్వాత తప్పు తెలుసుకుని వైద్యచికిత్స అందించినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ ఘటనను వాయవ్య ఢిల్లీ డిప్యూటీ పోలీసు కమిషనర్ అస్లాం ఖాన్ ధ్రువీకరించారు. ఈ ఉదంతంపై విచారణ జరిపేందుకు అధికారులతో ఒక కమిటీని నియమించినట్లు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. గత నెల 30న ఢిల్లీలోని షాలిమార్ బాగ్‌లో ఓ గర్భిణి కవల పిల్లలను (మగ, ఆడ) ప్రసవించింది. కవలలిద్దరూ మరణించినట్లు ప్రకటించి, ఆస్పత్రి సిబ్బంది మృతదేహాలను తల్లిదండ్రులకు అందజేశారు. అయితే, ఆ తర్వాత మగ శిశువులో కదలిక ఉన్నట్లు తల్లిదండ్రులు గుర్తించి వైద్యులను సంప్రదించారు. ఆ మగశిశువుకు వారం రోజులపాటు వెంటిలేటర్‌పై వైద్యచికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటనపై విచారణ జరిపి, ఆస్పత్రి సిబ్బంది తప్పుగా వ్యవహరించారని తేలితే తగిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ ఆరోగ్య శాఖామంత్రి సత్యేందర్ జైన్ మీడియాకు తెలిపారు.