జాతీయ వార్తలు

అనర్హత నిర్ణయంపై విమర్శలు తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: జెడి(యు) రెబెల్ ఎంపీలు శరద్ యాదవ్, అనిల్ అన్వర్లను అనర్హులుగా ప్రకటిస్తూ ఇచ్చిన తన ఉత్తర్వు నిర్ణయాన్ని విమర్శించటం ఎంతమాత్రం సహేతుకం కాదని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఖండించారు. న్యాయాన్ని ఆలస్యం చేయడం అంటే ఖండించడమేనని, ఇలాంటి వ్యవహారాల్లో ఉపేక్ష ఎంతమాత్రం సమ్మతం కాదన్నారు. కేంద్ర సమాచార కమిషన్ 12వ వార్షిక సమావేశంలో మాట్లాడుతూ తమవద్దకు వచ్చిన కేసులను వేగంగా పరిష్కరించేందుకు కమిషనర్లూ ఇదే తరహాలో నిజాయితీగా, వేగంగా ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. ‘సభ్యుల అనర్హతకు సంబంధించి నిన్న నేనొక ఉత్తర్వు జారీ చేస్తూనే ఓ సంకేతాన్నీ ఇచ్చాను. అది, ఇలాంటి కేసులపై మూడు నెలల వ్యవధిలోనే న్యాయబద్ధమైన నిర్ణయం తీసుకోవాలన్నది. ఇలాంటి కేసులను కొంతమంది ఏళ్ల తరబడి నాన్చడం చూస్తున్నాం’ అని నాయుడు వ్యాఖ్యానించారు. జెడి(యు) సభ్యుల అనర్హత విషయంలో తన నిర్ణయాన్ని దేశం మొత్తం అంగీకరించినా, ‘అంత తొందరగా చైర్మన్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది’ అని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతూనే ఉన్నారు’ అంటూ విమర్శకులపై చలోక్తులు విసిరారు. ఏ వ్యవహారంలోనైనా ‘న్యాయాన్ని ఆలస్యం చేయడం అంటే, దాన్ని ఖండించడమే’నని నాయుడు నొక్కి చెప్పారు. కేసుల విషయంలో సమాచార కమిషనర్లు అప్రమత్తంగా వ్యవహరించారని ‘సరైన సమయంలో సరైన సమాచారం’ ప్రజలకు అందించాలన్న విద్యుక్త ధర్మాన్ని మరువద్దని వెంకయ్యనాయుడు సూచించారు.