జాతీయ వార్తలు

జవాను హత్యకేసులో మిలిటెంట్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, డిసెంబర్ 6: ఆర్మీ జవాను ఇర్ఫాన్ దర్ హత్యకేసును ఛేదించి, ఓ మిలిటెంట్‌ను అరెస్టు చేసినట్లు స్థానిక పోలీసులు బుధవారం ప్రకటించారు. జవాను ఇర్ఫాన్‌ను గత నెలలో మిలిటెంట్లు హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టి, షోపియాన్ జిల్లా షిర్మల్‌కు చెందిన ముజామిల్ అనే మిలిటెంట్‌ను అరెస్టు చేశారు. గత నెల 25న బుల్లెట్లతో తూట్లుపడిన జవాను మృతదేహాన్ని ఉత్‌ములా ప్రాంతంలో పోలీసులు కనుగొన్నారు. అనంతరం కేసు నమోదు చేశాక పోలీసులు తీవ్రంగా పరిశోధించారు. ఇర్ఫాన్‌ను హతమార్చేందుకు కుట్రపన్నిన మిలిటెంట్లను సద్దామ్ పద్దేర్, బిలాల్ మొహంద్‌గా పోలీసులు గుర్తించారు. మిలిటెంట్ల బృందంలో కొత్తగా చేరి కుట్రకు సహకరించిన ముజామిల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇర్ఫాన్‌పై తుపాకులు గురిపెట్టి ఈ మిలిటెంట్లు కాల్పులు జరిపారని పరిశోధనలో తేలింది. హత్య జరిగిన తీరును నిందితుడు ముజామిల్ తమకు వివరించాడని పోలీసులు తెలిపారు. జవాను హత్యకేసుకు సంబంధించి మిగతా ముగ్గురు మిలిటెంట్ల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.