జాతీయ వార్తలు

అంబేద్కర్‌కు జాతి నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్‌కు జాతి ఘన నివాళులర్పించింది. అంబేద్కర్ 61వ వర్ధంతి సందర్భంగా రాజధాని ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. అంబేద్కర్ దేశానికి, ముఖ్యంగా దళితుల ఉద్ధరణకు ఎనలేని కృషి చేశారని పలువురు శ్లాఘించారు. రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ తదితరులు అంబేద్కర్ సేవలను కొనియాడారు. పార్లమెంట్ ప్రాంగణంలో అంబేద్కర్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, తన్వర్ చంద్ గెహ్లాట్, సీనియర్ కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే బాబాసాహెబ్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. 65వ ఏట 1956లో అంబేద్కర్ కన్నుమూశారు. మహానీయుడు అంబేద్కర్ వర్థంతిని మహాపరినిర్వాణ్ దివస్‌గా పాటిస్తున్నట్టు ప్రధాని మోదీ తన ట్విట్టర్‌లో తెలిపారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా అంబేద్కర్‌కు ఘన నివాళులు అర్పించారు. ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని రాహుల్ పిలుపునిచ్చారు. దళితుల ఉద్ధరణకు అంబేద్కర్ అహర్నిశలు పాటుపడ్డారని ఆయన అన్నారు.
ముంబయిలో...
ముంబయి: బాబా సాహెబ్ అంబేద్కర్ 61 వర్ధంతిని ఘనంగా జరుపుకొన్నారు. మహారాష్టల్రో బుధవారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. ముంబయిలోని బాబా సాహెబ్ చైత్యభూమిలో ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. దాదర్‌లోని శివాజీ పార్కు వద్ద ఉన్న స్మారక స్థలికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విచ్చేశారు. ఇందూమిల్ స్థలంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అంబేద్కర్ స్మారక మందిరం పనులు నెలలో ప్రారంభవవుతాయని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. చైత్యభూమిలో మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్‌రావు రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పించారు. రెండ్రోజుల క్రితం కురిసిన వర్షాలకు ఆ ప్రాంతమంతా చిత్తడిగా మారిపోయింది. అయినప్పటికీ దేశం నలుమూలల నుంచి వందలాది మంది అంబేద్కర్ అభిమానులు తరలివచ్చి ప్రియతమ నాయకుడికి అంజలి ఘటించారు. జై భీమ్, బాబా సాహెబ్ అమర్హ్రే అంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర సచివాలయం మంత్రాలయలో అంబేద్కర్ వర్ధంతి ఘనంగా జరిగింది. విధాన్ భవన్‌లోనూ ఉద్యోగులు బాబా సాహెబ్‌కు నివాళులర్పించారు. దాదర్ నుంచి శివాజీపార్క్ వద్దకు రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను నడిపింది. బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ చైత్యభూమి వద్ద తాత్కాలిక షెడ్లు, సంచార మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసింది. అంబేద్కర్ నివాసం ‘రాజ్‌గృహ్’, కుర్లా టెర్మినస్ వద్ద పెద్ద సందర్శకుల రద్దీ కనిపించింది. దళిత నేతకు నివాళులర్పించడానికి వచ్చేవారి కోసం ప్రభుత్వ అన్ని ఏర్పాట్లు చేసింది.

చిత్రం.. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పార్లమెంట్ హౌలో ఆయన చిత్రపటానికి నివాళులర్పిస్తున్న రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ.