జాతీయ వార్తలు

ప్రశాంతంగా బ్లాక్ డే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 6: హైదరాబాద్ పాతబస్తీలో బ్లాక్ డే ప్రశాంతంగా ముగిసింది. బాబ్రీ మసీదు కూల్చివేతను నిరసిస్తూ డిజెఎస్, ఎంబిటి పాతబస్తీ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు పాతబస్తీలో బుధవారం డిజెఎస్, ఎంబిటి కార్యకర్తలు దుకాణాలను బలవంతంగా మూయించేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో పలువురు ముస్లిం సంస్థలకు చెందిన కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. యాకుత్‌పుర, బార్కస్, సలార్ ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమైన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా డిజెఎస్, ఎంబిటి నాయకులు మాట్లాడుతూ, 1992 డిసెంబర్ 6న కొందరు హిందూ మతోన్మాదులు బాబ్రీ మసీదును కూల్చివేశారని, కూల్చినచోటే బాబ్రీ మసీదు నిర్మించాలని డిమాండ్ చేశారు. పాతబస్తీలో నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్టు సౌత్‌జోన్ డీసీపీ వి సత్యనారాయణ తెలిపారు. దాదాపు మూడువేల మంది సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు.
ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, అశ్వదళాలు, ఆర్మ్డ్ రిజర్వ్డ్ ఫోర్స్, అదనపు బలగాలను మోహరింపజేశారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు నిరసనగా ఇచ్చిన బంద్ మొత్తం మీద ప్రశాంతంగా జరిగింది. ఎక్కడా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణ వివరించారు.