జాతీయ వార్తలు

ఎన్నికలకు, అయోధ్య వివాదానికి సంబంధమేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధండూక (గుజరాత్), డిసెంబర్ 6: 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలతో అయోధ్య వివాదాన్ని ముడి పెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఆయన బుధవారం ఇక్కడ జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, రామజన్మభూమి- బాబ్రీ మసీదు కేసుపై సుప్రీం కోర్టులో కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ వాదన సరికాదని మండిపడ్డారు. మసీదు నిర్మాణం కోసం వాదిస్తున్న కపిల్ సిబల్ కేసు విచారణను 2019 ఎన్నికల వరకూ వాయిదా వేయాలని వాదించడం విడ్డూరంగా ఉందన్నారు. రామమందిరానికి, ఎన్నికలకు సంబంధం ఏమిటి? ఇలా ఆలోచించడం సమంజసమేనా?- అని మోదీ ప్రశ్నించారు. అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేసి పాతికేళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా, సిబల్ చేస్తున్న వాదనను కాంగ్రెస్ సమర్థిస్తోందా? అని బీజేపీ నేతలు నిలదీస్తున్నారు. మసీదు- మందిరంపై తమ విధానాన్ని కాంగ్రెస్ బహిర్గతం చేయాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా డిమాండ్ చేశారు.