జాతీయ వార్తలు

మణిశంకర్ సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడైన కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్‌పై ఆ పార్టీ ఆగమేఘాలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. గుజరాత్ అసెం బ్లీ ఎన్నికలకు మరో రెండు రోజుల్లో పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం వ్యూహాత్మకంగా వ్యవహరించి అయ్యర్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. విధేయత కన్నా పార్టీ ప్రయోజనాలే మిన్న అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఇలా అనూహ్యమైన నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రధాని నరేంద్ర మోదీని ‘నీచ్ ఆద్మీ’ (తుచ్చమైన వ్యక్తి) అని మణిశంకర్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను భాజపా నేతలు తీవ్రంగా ఖండించగా, కాంగ్రెస్‌లోనూ అంతర్మథనం ప్రారంభమైంది. అయ్యర్ వ్యాఖ్యలు ఒక సామాజిక వర్గాన్ని ఉద్దేశిస్తూ చేసినట్టు ఉన్నాయని భావించిన కాంగ్రెస్ పార్టీ వెంటనే నష్టనివారణ చర్యలు ప్రారంభించింది. మణిశంకర్‌ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించడమే గాక షోకాజ్ నోటీసును జారీ చేసినట్లు కాంగ్రెస్ కమ్యూనికేషన్ విభాగం ఇన్‌చార్జి రణ్‌దీప్ సుర్జేవాలా గురువారం ప్రకటించారు. తమ పార్టీ ‘గాంధీ మార్గాన్ని’ అనుసరిస్తోందని, రాజకీయ ప్రత్యర్థులను గౌరవిస్తోందనడానికి ఈ క్రమశిక్షణ చర్య సాక్ష్యమని ఆయన తెలిపారు.
మోదీకి అయ్యర్ క్షమాపణ..
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశం మేరకు మణిశంకర్
అయ్యర్ ప్రధాని మోదీకి క్షమాపణలు చెప్పారు. మణిశంకర్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ఇలాంటి భాషను ఉపయోగించటం కాంగ్రెస్ సంస్కృతి కాదని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కాంగ్రెస్‌ను విమర్శించేందుకు దిగజారుడు భాషను వాడడం మంచిది కాదని ఆయన స్పష్టం చేశారు. రాహుల్ ట్వీట్‌కు అయ్యర్ స్పందిస్తూ వెంటనే ప్రధాన మంత్రికి క్షమాపణలు చెప్పారు. తాను ఉపయోగించిన పదం వేరే అర్థం వచ్చేలా ఉంటే అందుకు చింతిస్తున్నానని తెలిపారు. అంబేద్కర్ కేంద్రాన్ని ప్రారంభించినపుడు మోదీ రాహుల్‌పైన, కాంగ్రెస్‌పైన విమర్శలు గుప్పించవలసిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. మోదీ ‘తుచ్చమైనవాడు’ అంటే ‘తుచ్చస్థాయికి చెందిన వాడన్నది’ తన అర్థం తప్ప నీచ కులానికి చెందిన వాడన్నది కాదని అయ్యర్ వివరించారు. హిందీ తన మాతృభాష కాకపోవటం వలన ఇలాంటి తప్పులు జరుగుతున్నాయని వివరణ ఇచ్చారు. మోదీ నీచ కులంలో పుట్టాడని తానెప్పుడు అనలేదన్నారు.
గుజరాత్ ప్రజలను అవమానించడే: మోదీ
కాంగ్రెస్ నేత అయ్యర్ చేసిన వ్యాఖ్యలు గుజరాత్ ప్రజలను కించపరచేలా ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు. ‘నీచ్ ఆద్మీ’ అంటూ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు ‘మొగల్ మనస్తత్వాని’కి అద్దం పడుతున్నాయని అన్నారు. సూరత్‌లో ఉన్న మోదీ తనపై అయ్యర్ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ, ‘నన్ను తుచ్చమైన వ్యక్తి అనడం యావత్ గుజరాతీయులను అవమానించడమేనని అన్నారు. ‘పేద ప్రజలు మంచి దుస్తులు ధరించడాన్ని కూడా సహించలేని మొగల్ మనస్తత్వానికి పరాకాష్ఠ ఇది..’ అని మోదీ అన్నారు.

‘మీరు నన్ను నీచుడిని అన్నారు. ఇది
గుజరాత్‌కే అవమానం. ప్రజలు కమలానికి
ఓటేసి(మీకు) జవాబిస్తారు’
- నరేంద్ర మోదీ

‘ఈ మనిషి మరీ నీచుడు. ఇతనికి
ఏ మాత్రం సభ్యత, నాగరికత లేదు’
- మణిశంకర్ అయ్యర్