జాతీయ వార్తలు

ఆధార్ గడువు పొడిగిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: బ్యాంకు ఖాతాలు, సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం చేసుకోడానికి వచ్చే ఏడాది మార్చి 31 వరకూ గడువుపొడిగించడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్రం స్పష్టం చేసింది. సంక్షేమ పథకాలు, బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ దాఖలైన పిటిషన్‌ను రాజ్యాంగ ధర్మాసనం వచ్చేవారం విచారించనుంది. కాగా మొబైల్ నెంబర్‌తో ఆధార్‌ను అనుసంధానం చేసుకునే గడువువచ్చే ఫిబ్రవరి 6 వరకూ ఉందని, దాన్ని మాత్రం పొడిగించలేమని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీం కోర్టుకు తెలిపారు. న్యాయస్థానం ఆదేశాలమేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన స్పష్టం చేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ వాదనలు వినిపించారు. న్యాయమూర్తులు ఏఎం ఖన్వీల్కర్, డివై చంద్రచూడ్ బెంచ్ పిటిషన్‌ను విచారించింది.