జాతీయ వార్తలు

మహిళలకు రక్షణ ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: దేశవ్యాప్తంగా మహిళపై జరుగుతున్న నేరాలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీపీఎం ఆరోపించింది. మహిళలపై నేరాలు పెరుగుతునే ఉన్నట్టు నేషనల్ క్రైమ్ బ్యూరో తాజా నివేదికలో పేర్కొనడంపై పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు, చిన్నపిల్లలపై లైంగిక దాడులు అదుపుచేసే యంత్రాంగం గానీ, ఓ విధానం గానీ కేంద్రం వద్ద లేదని గురువారం ఇక్కడ ధ్వజమెత్తారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలు, పిల్లలకు భద్రత కల్పిస్తామని బీజేపీ ప్రకటించిన విషయాన్ని సీపీఎం నేత గుర్తుచేశారు. వాస్తవంలోకి వస్తే దేశంలో అలాంటి వాతావరణమే మృగ్యమైందని ఆయన విమర్శించారు. మహిళలు, చిన్నపిల్లలపై జరుగుతున్న నేరాలను అదుపుచేయడానికి లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెంట్లు, సంస్థలు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సీపీఎం అధికార పత్రిక ‘పీపుల్స్ డెమోక్రసీ’ సంపాదకీయంలో కారత్ పలు అంశాలను ప్రస్తావించారు. మహిళలపై దాడులు, బాధితులను ఆదుకోవడానికి సంబంధించి వర్మ కమిటీ సిఫార్సులను అమలుచేయాలని కేంద్రాన్ని ఆయన కోరారు.