జాతీయ వార్తలు

11 మంది మాజీ ఎంపీల విచారణకు రంగం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: 2005 నాటి ‘ప్రశ్నకు నగదు’ కుంభకోణానికి సంబంధించి పదకొండు మంది మాజీ ఎంపీలపై దాఖలైన నేరారోపణలపై విచారించేందుకు ఢిల్లీలోని ఓ న్యాయస్థానం రంగం సిద్ధం చేసింది. 11మంది మాజీ ఎంపీలతో పాటు మరో వ్యక్తిపై విచారణకు ప్రత్యేక న్యాయమూర్తి కిరణ్ బన్సాల్ ఆదేశాలు జారీ చేశారు. బీజేపీకి చెందిన మాజీ ఎంపీలు వైజీ మహాజన్, ఛత్తర్‌పాల్ సింగ్ లోధా, అన్నా సాహెబ్ ఎంకె పాటిల్, చంద్రప్రతాప్ సింగ్, ప్రదీప్ గాంధీ, సురేశ్ చందేల్, ఆర్జేడికి చెందిన మనోజ్‌కుమార్, కాంగ్రెస్‌కు చెందిన రామ్‌సేవక్ సింగ్, బిఎస్పీకి చెందిన కుమార్ కుశ్వాహ, లాల్‌చంద్ర కోల్, రాజా రాంపాల్ ఈ కుంభకోణంలో నిందితులుగా ఉన్నారు. ఇద్దరు పాత్రికేయులు ‘స్టింగ్ ఆపరేషన్’ జరపగా ఈ ఎంపీలు లంచాలు తీసుకున్నట్లు ఓ ప్రైవేటు న్యూస్ చానల్‌లో 2005 డిసెంబర్ 12న కథనాలు వచ్చాయి. పార్లమెంటులో ప్రశ్నలు వేసేందుకు కొందరి నుంచి వీరు లంచాలు తీసుకోవడంతో ఈ వ్యవహారం ‘ప్రశ్నకు నగదు కుంభకోణం’గా ప్రసిద్ధి చెందింది. 2005 డిసెంబర్‌లో లోక్‌సభ నుంచి పదిమంది ఎంపీలను, రాజ్యసభ నుంచి ఒక ఎంపీ (లోధా)ను బహిష్కరించారు. ఈ స్కామ్‌కు సంబంధించి సీడీలు,డీవీడీలను స్వాధీనం చేసుకున్నాక కేసులు నమోదు చేశారు.
మాజీ ఎంపీ రామ్‌పాల్‌కు అప్పట్లో వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన రవీందర్ కుమార్‌పైనా నేరారోపణలు నమోదైనట్లు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ శ్రీవాస్తవ తెలిపారు. మధ్యవర్తిగా వ్యవహరించిన మరో నిందితుడు విజయ్ పోగట్ మరణించడంతో ఆయనపై నేరారోపణలు తొలగించారు. భారత శిక్షాస్మృతి సహా అవినీతి నిరోధక చట్టం కింద నిందితులపై కేసులు నమోదు చేశారు. ఈ స్కామ్‌పై 2009లో ఢిల్లీ పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. మాజీ ఎంపీలతో పాటు ఇద్దరు జర్నలిస్టులపైనా చార్జిషీటు దాఖలైంది. అయితే, ఆ జర్నలిస్టులపై చార్జిషీటు తొలగించాలని గతంలోనే ఢిల్లీ హైకోర్టు ఆదేశాలిచ్చింది.