జాతీయ వార్తలు

యూపీ వీధుల్లో బంగాళాదుంప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోట్లాది రూపాయల విలువైన బంగాళా దుంపలను ఇటు యూపీ రైతాంగం, అటు కోల్డ్‌స్టోరేజీ యజమానులు వీధుల్లో పడేస్తున్నారు. ఈ బంగాళా దుంపలను అమ్మడం వల్ల తమకు పెట్టుబడులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. అంతేకాదు వీటిని నెలల తరబడి కోల్డ్‌స్టోరేజీలో ఉంచేందుకు అవసరమైన ఖర్చునూ భరించలేకపోతున్నామని చెబుతున్నారు. కోల్డ్ స్టోరేజీ యాజమాన్యాలు కూడా తమకు రైతుల నుంచి అద్దెలే రావడం లేదని బస్తాను రూ.60 నుంచి 70కే అమ్మేస్తున్నామని మిగిలిన వాటిని వీధుల్లో పడేస్తున్నామని అన్నారు. ఒకపక్క పేదరికం, పౌష్ఠికాహార లోపం, ఆకలి చావులు తీవ్రంగా ఉన్న దేశంలో శరీరానికి బలాన్నిచ్చే బంగాళా దుంపలను ఇలా వీధి పాలుచేయడం నిర్లక్ష్యానికి పరాకాష్ట!