జాతీయ వార్తలు

ముందుంది మంచిరోజు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కిసమా (నాగాలాండ్), డిసెంబర్ 8: ఉజ్వల భవిష్యత్ దిశగా నాగాల ఆకాంక్షలను నెరవేర్చే శాంతిదినం ఎంతో దూరంలో లేదని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. దశాబ్దాలుగా పోరాటపథాన నడుస్తున్న నాగాల ఆకాంక్షలు నేరవేర్చడానికి కేంద్రం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. అయితే, నాగాల తిరుగుబాటుకు శాశ్వత పరిష్కారం చూపే ఉద్దేశంతో ఎన్‌ఎస్‌సిఎన్-ఐఎం నాయకత్వంతో కేంద్రం సాగిస్తోన్న శాంతి చర్చల సారాంశాన్ని మాత్రం మంత్రి వెల్లడించలేదు. ‘ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం నాగాల సమస్యల పరిష్కారానికి కృతనిశ్చయంతో ఉంది. ఉజ్వల భవిష్యత్ దిశగా నాగాల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది’ అని రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు. నాగాలాండ్ రాజధాని కోహిమాకు పనె్నండు కిలోమీటర్ల దూరంలోని నాగా సాంస్కృతిక గ్రామంలో జరిగిన హోర్న్‌బిల్ వేడుకల్లో మంత్రి మాట్లాడారు. కొద్దిరోజుల క్రితమే నాగాలాండ్‌లో పర్యటించిన రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ సైతం ‘నాగాలో శాంతి నెలకొనే రోజు దగ్గర్లోనే ఉంది. రాజకీయ సమస్యపై తలెత్తుతోన్న తిరుగుబాట్లకు శాశ్వత పరిష్కారం దిశగా ఒప్పందాలు కుదురుతున్నాయి.
త్వరలోనే రాష్ట్రం శాంతిబాటన నడుస్తుంది’ అని ప్రకటించారు. అంతకుముందు, గత సెప్టెంబర్ 19న గవర్నర్ పిబి ఆచార్య సైతం ఇదే విషయాన్ని ప్రకటించటం గమనార్హం. ఏళ్ల తరబడి రావణకాష్టంలా మండుతున్న నాగా రాజకీయ సమస్యకు మరో నెల, రెండు నెలల్లో శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉందంటూ వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో నాగా సాంస్కృతిక పర్యాటక పండుగలో పాల్గొన్న హోంమంత్రి రాజ్‌నాథ్ మాట్లాడుతూ నాగాలో శాశ్వత ప్రాతిపదికన శాంతి నెలకొల్పేందుకు అవసరమైన చర్యలను కేంద్రం తీసుకుంటోందని వివరించారు. భారత్- మయన్మార్ సరిహద్దుల్లోని ప్రజలు శాంతియుత జీవనం సాగించేందుకు వీలుగా సరిహద్దుల్లోని వ్యాపార కార్యకలాపాలపై ఆంక్షలు సరళతరం చేయనున్నట్టు వివరించారు. దీనివల్ల అక్రమ రవాణా, అనైతిక కార్యకలాపాలకు తెరపడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి, స్థిరత్వం, సౌబ్రాతృత్వం, అభివృద్ధి సాధనకు నాగాలాండ్ కీలక అవకాశాన్ని కల్పిస్తోందని రాజ్‌నాథ్ అన్నారు. ‘ప్రకృతి వనరులు, ప్రతిభావంతులైన ప్రజలు, అనితరసాధ్యమైన అవకాశాలున్న రాష్ట్రంలో బలమైన శాంతిబీజాలు పడనున్న తరుణంలో, అభివృద్ధి దిశగా అడుగులేసి ఈశాన్య రాష్ట్రాలకు, దేశానికీ నాగాలాండ్ మార్గదర్శకం కావాలని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు.