జాతీయ వార్తలు

నేడు గుజరాత్ తొలి దశ పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతోపాటు ఎన్‌డీఏ ప్రభుత్వానికి అగ్ని పరీక్షగా మారిన గుజరాత్ శాసనసభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ శనివారం జరుగబోతోంది. బీజేపీని భయపెట్టిస్తున్న పటేల్ వర్గం బాగా బలంగా ఉన్న సౌరాష్టత్రోపాటు దక్షిణ గుజరాత్‌లోని 89 సీట్లకు పోలింగ్ జరగనుంది. 89 సీట్లకు మొత్తం 977 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా పోటీ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యనే ఉండబోతోంది. ముఖ్యమంత్రి విజయ్ రూపాని రాజ్‌కోట్ నుండి పోటీ చేస్తున్నారు. మొదటి దశ పోలింగ్‌కు ఒక రోజు ముందు బీజేపీ తమ ఎన్నికల ప్రణాళికను ప్రకటించి ఓటర్లను ఆకర్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా ఎన్నికల ప్రచారం చేశాయి. నరేంద్ర మోదీ బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని తన భుజస్కంధాలపై వేసుకుని ముందుకు నడిపించారు. రాహుల్ గాంధీ మొదటిసారి యుద్ధ ప్రాతిపదికపై గుజరాత్‌లో ఎన్నికల ప్రచారం చేయటంతోపాటు పటేల్ వర్గానికి చెందిన హార్దిక్ పటేల్, షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగలకు చెందిన జిగ్నేష్ మెవానీతో సీట్ల సర్దుబాటు చేసుకోవటంతోపాటు బీసీ నాయకుడు అల్పేష్ ఠాకూర్‌ను పార్టీలో చేర్చుకున్నారు. మొదట దశ పోలింగ్ కోసం నరేంద్ర మోదీ, అమిత్ షాతోపాటు దాదాపు ఇరవై ఐదు మంది కేంద్ర మంత్రులు బీజేపీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ ప్రధానంగా ఎన్నికల ప్రచార బాధ్యత నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు అహ్మద్ పటేల్, రాజ్యసభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్, ఉపనాయకుడు ఆనంద్ శర్మ మరికొందరు జాతీయ నాయకులు సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లో కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం చేశారు. హార్దిక్ పటేల్ కాంగ్రెస్‌తో చేతలు కలపటం మూలంగా తమకు జరిగే నష్టాన్ని పూడ్చుకునేందుకు బీజేపీ అధినాయకులు రాష్ట్రంలోని బీసీ వర్గాల మద్దతు సంపాదించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. హార్దిక్ పటేల్ శృంగార సీడీల మూలంగా కాంగ్రెస్‌కు కొంత నష్టం వాటిల్లినా దీనికంటే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన విమర్శ కాంగ్రెస్‌కు తీరని నష్టం కలిగించింది. ప్రధానిపై మణిశంకర్ అయ్యర్ చేసిన అనాగరిక వ్యాఖ్యల మూలంగా కాంగ్రెస్‌కు కలిగే భారీ నష్టాన్ని అరికట్టేందుకు రాహుల్ గాంధీ స్వయంగా రంగంలోకి దిగవలసి వచ్చింది. అయితే నరేంద్ర మోదీ అప్పటికే మణిశంకర్ అయ్యర్ దుర్భాష గురించి ఎన్నికల ప్రచార సభలో గుజరాత్ ప్రజలకు వివరించారు. మణిశంకర్ అయ్యర్ తనను హత్య చేయించేందుకు పాకిస్తాన్‌కు చెందిన హంతకులకు కాంట్రాక్ట్ ఇచ్చారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు.
రాహుల్ గాంధీ గుజరాత్‌లోని పలు దేవాలయాలను సందర్శించటంతోపాటు పలుచోట్ల ఆయన పూజలు చేయటం గమనార్హం. బీజేపీ హిందుత్వ వాదాన్ని హైజాక్ చేసేందుకే ఎన్నికల ప్రచారంలో కనిపించిన ప్రతి దేవాలయానికి వెళ్లి రాహుల్ గాంధీ పూజలు చేయడం విశేషం.