జాతీయ వార్తలు

గుజరాత్‌లో 68శాతం పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, న్యూఢిల్లీ, డిసెంబర్ 9: గుజరాత్ శాసనసభకు 89 నియోజకవర్గాల్లో శనివారం జరిగిన తొలి విడత ఎన్నికల్లో 68 శాతం పోలింగ్ నమోదైంది. ఓటర్లు భారీ సంఖ్యలో తరలివచ్చి బారులు తీరడంతో సాయంత్రం అయిదు గంటల తర్వాత కూడా కొన్ని చోట్ల పోలింగ్ కొనసాగిందని సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ఉమేష్ సిన్హా ఢిల్లీలో తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా సాగినప్పటికీ ఇవిఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల)లలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ విపక్ష పార్టీలు ఆరోపంచాయి. అయితే, ఈ ఆరోపణలను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. తొలి విడత ఎన్నికల్లో 2.1 మంది ఓటర్లలో 68 శాతం మంది పోలింగ్‌లో పాల్గొన్నారని సిన్హా తెలిపారు. పోర్‌బందర్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలోని ఇవిఎంకు ‘బ్లూటూత్’ ద్వారా తన సెల్‌ఫోన్‌ను ఎవరో కనెక్ట్ చేశారని కాంగ్రెస్ అభ్యర్థి చేసిన ఆరోపణపై విచారించగా అది నిజం కాదని తేలిందని డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సందీప్ జైన్ తెలిపారు. ఓ పోలింగ్ ఏజెంట్ సెల్‌ఫోన్‌కు బ్లూటూత్ ఉన్నట్లు తేలిందని వివరించారు. ఇవిఎంలను ఏ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతోనూ అనుసంధానం చేయలేదన్నారు. సూరత్ సహా మరికొన్ని ప్రాంతాల్లో సాంకేతిక సమస్యలతో మొదట్లో ఇవిఎంలు మొరాయించగా, వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేశామని రాష్ట్ర ఎన్నికల అధికారులు తెలిపారు.

చిత్రం.. తొలి దఫా పోలింగ్‌లో ఓటు హక్కు వినియోగించుకుంటున్న సీఎం విజయ్ రూపాని.