జాతీయ వార్తలు

రాజకీయ లబ్ధికే మోదీ ఓబీసీ జపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగ్‌పూర్, డిసెంబర్ 9: రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రధాని నరేంద్ర మోదీ ‘ఓబీసీ కార్డు’ను వాడుకుంటున్నారని లోక్‌సభ సభ్యత్వానికి, బీజేపీకి రాజీనామా చేసిన నానా పటోల్ ఆరోపించారు. హామీలను అమలు చేయడంలో బీజీపీ విఫలం కావడంతో ఎంపీ పదవికి, పార్టీకి రాజీనామా చేశానని ఆయన శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. పటోల్ శనివారం ఇక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ప్రధాని మోదీ ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తూ ఎన్నికల్లో గెలుపు కోసం ఓబీసీ (ఇతర వెనుకబడిన కులాలను)లను, రైతులను మభ్యపెడుతున్నారని అన్నారు. నిజానికి ఓబీసీలకు, రైతులకు మోదీ ఎలాంటి మేలు చేయలేదన్నారు. కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ప్రధాని ఇతరుల విషయంలో మాత్రం అలా వ్యవహరించకుండా ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నారని అన్నారు. ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని గత ఏడాది తాను ప్రధానికి సూచించగా, ఆయన తనపై కేకలు వేయడమే గాక ఓబీసీలకు అలాంటి సౌకర్యాలు అక్కర్లేదని అన్నారని పటోల్ వివరించారు. అయితే అదే ఓబీసీ వర్గాల ఓట్లకోసం ఇపుడు పాకులాడడం ఎందుకని ప్రశ్నించారు. కేంద్రంలో, మహారాష్టల్రో బీజేపీ అధికారంలో ఉన్నా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. రైతు సమస్యలపై కేంద్రం ఏ మాత్రం స్పందించడం లేదని, దేశ ప్రజలను మోదీ వంచిస్తున్నారని ఆరోపించారు.