జాతీయ వార్తలు

క్యాబ్‌లో మహిళపై లైంగిక దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుర్గావ్, డిసెంబర్ 9: తనపై లైంగిక దాడి జరిగిందని ఓ మహిళ ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్‌కు వెళ్తే దాన్ని స్వీకరించకపోగా దోపిడీ కేసు పెట్టమని వత్తిడి చేశారు. లైంగిక దాడి అంశాన్ని పక్కనబెట్టి దోపిడీ కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకున్నట్టు బాధిత మహిళ వాపోయింది. అయితే భర్తను తీసుకుని పోలీసు స్టేషన్‌కు వచ్చిన మహిళ తన వద్ద మొబైల్ ఫోన్, నగదు ఎత్తుకెళ్లారని మాత్రమే చెప్పారని ఏసీపీ మనీష్ సెహ్‌గల్ చెప్పారు. తనపై లైంగిక దాడి జరిగిందన్న సంగతే ఆమె చెప్పలేదని, పైగా తమ దర్యాప్తుపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని ఆయన అన్నారు. ‘ఆమెపై అత్యాచారయత్నం జరిగిన ఆధారాలు లేవు. ప్రాథమిక దర్యాప్తులోనూ ఇదే నిర్ధారణ అయింది’ అని సెహ్‌గల్ స్పష్టం చేశారు. ఏదిఏమైనా ఎస్‌హెచ్‌ఓ మహిళా కౌన్సిలర్ శనివారం బాధిత మహిళను కలిసి వివరాలు తెలుసుకున్నట్టు, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్టు ఏసీపీ వెల్లడించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కంగ్రా జిల్లాకు చెందిన 30 ఏళ్ల మహిళ గుర్గావ్‌లోని ఓ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోంది. గురువారం రాత్రి 8 గంటల సమయంలో ఆఫీసులో పని ముగించుకుని నిత్యం రద్దీగా ఉండే శంకర్ చౌక్‌లో క్యాబ్ ఎక్కింది. గుర్గావ్‌లోని హీరోహోండా షోరూం వద్దకు తీసుకెళ్లమని డ్రైవర్‌కు చెప్పింది. అయితే అప్పటికే ప్రయాణికుల్లా నటిస్తూ ఇద్దరు వ్యక్తులు క్యాబ్‌లో ఉన్నారు. క్యాబ్ జర్సాచౌక్ సమీపంలోకి చేరుకునేసరికి డ్రైవర్, ఇద్దరు వ్యక్తులు మహిళను లైంగిక వేధింపులకు గురిచేయడం మొదలెట్టారు. ఆమె కాళ్లూ చేతులూ నొక్కిపట్టి ఊపిరి ఆడకుండా చేశారు. తనపై అత్యాచారం చేయబోయారని బాధితురాలు తెలిపింది. ఆ సమయంలో ఆ ప్రాంతానికి ఇద్దరు పోలీసులు బైక్‌పై రావడాన్ని గమనించిన ముష్కరులు రాజీవ్ చౌక్ వద్ద క్యాబ్‌లోంచి గెంటేసి పారిపోయారు. స్థానికుల సహకారంతో భర్తకు సమాచారం ఇచ్చిన మహిళ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.