జాతీయ వార్తలు

గుజరాత్ ఎన్నికల్లో 397 మంది కోటీశ్వరులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, డిసెంబర్ 9: గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో 397 మంది కోటీశ్వరులు పోటీ చేస్తున్నారు. అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లను విశే్లషించిన రెండు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ విషయాన్ని వెల్లడించారు. రెండు విడతలుగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 1,828 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో పనె్నండవ తరగతి, ఆ కింది స్థాయి చదువు ఉన్న వారి సంఖ్య 1,098. మొత్తం అభ్యర్థుల్లో మహిళల సంఖ్య 118 అని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్), ‘గుజరాత్ ఎలక్షన్ వాచ్’ (జిఇడబ్ల్యు) అనే స్వచ్ఛంద సంస్థలు తెలిపాయి. తొలిదశ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 977 మంది అభ్యర్థుల్లో కోటి రూపాయలకు మించి ఆస్తులున్న వారి సంఖ్య 198. రెండో విడత ఎన్నికలకు సిద్ధమవుతున్న 851 మందిలో 199 మంది కోటీశ్వరులున్నారు. 397 మంది కోటీశ్వరుల్లో 5 కోట్లకు మించి ఆస్తులున్నవారు 131 మంది, రెండు నుంచి ఐదు కోట్ల లోపు ఆస్తులున్నవారు 124 మంది ఉన్నారు. అధికార బీజేపీ నుంచి 142 మంది, కాంగ్రెస్ నుంచి 127 మంది, ఎన్‌సిపి నుంచి 17 మంది, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 13 మంది, బీఎస్పీ నుంచి అయిదుగురు కోటీశ్వరులు పోటీ చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థుల్లో 56 మంది కోటీశ్వరులున్నారు. చిన్నాచితకా పార్టీల నుంచి కూడా కొందరు సంపన్నులు బరిలో ఉన్నారు. దస్క్‌రోయ్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న పంకజ్ పటేల్ 231.93 కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించి ఈ ఎన్నికల్లో ‘అత్యంత సంపన్న అభ్యర్థి’గా నిలిచారు. ఆ తర్వాతి స్థానంలో రాజ్‌కోట్-పశ్చిమ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి 141.22 కోట్లతో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి, గుజరాత్ ఆర్థిక మంత్రి 123.78 కోట్ల ఆస్తులను చూపించారు. వద్వాన్ నుంచి బిజెపి తరఫున పోటీ చేస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త ధన్జ్భీయ్ పటేల్ 113. 47 కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించారు.
ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు మాత్రం తమకు ఎలాంటి స్థిర చరాస్తులు లేవని పేర్కొన్నారు. 13 మంది అభ్యర్థులు తమ వార్షికాదాయం కోటి రూపాయలు మించినట్లు ఆదాయపు పన్ను రికార్డులను చూపారు. ఇక, విద్యార్హతల విషయానికొస్తే 5 నుంచి 12వ తరగతి ప్యాసయినవారి సంఖ్య 1,098. అక్షరాస్యులు 119 మంది, నిరక్షరాస్యులు 23 మంది బరిలో ఉన్నారు. 25 నుంచి 40 ఏళ్ల లోపు వయసువారు 658 మంది, 41 నుంచి 60 ఏళ్ల లోపువారు 889 మంది, 61 నుంచి 80 ఏళ్లలోపు వారు 193 మంది ఉన్నారు.

చిత్రం..గుజరాత్‌లో శనివారం జరిగిన మొదటి విడత ఎన్నికల్లో రాజ్‌కోట్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు వేసేందుకు వస్తున్న 126 ఏళ్ల అంజీబెన్