జాతీయ వార్తలు

భారత్.. నా తల్లీ, తండ్రీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లునావద (గుజరాత్), డిసెంబర్ 9: గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి భావోద్వేగానికి లోనై, తనపై కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగతంగా దాడి చేస్తోందని నిరసన వ్యక్తం చేశారు. ‘నీ తల్లిదండ్రులెవరు..?’ అంటూ కాంగ్రెస్‌కు చెందిన సల్మాన్ నిజామీ అనే నేత ట్విట్టర్‌లో తనను ప్రశ్నించడం ఆందోళనకు గురి చేసిందని మోదీ చెప్పుకొచ్చారు. తనను ‘నీచ్ ఆద్మీ’ (తుచ్చమైన వ్యక్తి) అంటూ కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ ఇదివరకే వ్యాఖ్యానించారని, ఇపుడు రాహుల్ అనుచరుడైన ఓ యువ నాయకుడు (సల్మాన్ నిజామీ) తన తల్లిదండ్రుల ఆరా తీశారని ఆయన వివరించారు. గుజరాత్‌లోని లునావదలో శనివారం జరిగిన బీజేపీ ర్యాలీలో మోదీ మాట్లాడుతూ, తన తల్లిదండ్రులు భారత్ అని, తాను దేశసేవలో తరిస్తున్న కుమారుడినని అన్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌తో పాటు పాల్గొంటున్న సల్మాన్ ఇలా వ్యాఖ్యలు చేయడం పట్ల మోదీ ఆవేదన చెందారు. ‘రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ, నాన్నమ్మ ఇందిరా గాంధీ దేశం కోసం బలిదానాలు చేశారని, తాత జవహర్‌లాల్ నెహ్రూ స్వాతంత్య్ర సమరయోధుడ’ని సల్మాన్ చేసిన ట్వీట్లపై తనకు ఎటువంటి అభ్యంతరం లేదని మోదీ అన్నారు. అయితే, ‘తన తల్లిదండ్రులెవరో సమాధానం చెప్పాల’ని నిలదీయడం పట్ల మోదీ అభ్యంతరం తెలిపారు. ‘ఇలాంటి భాషను మనం ఉపయోగిస్తామా? ఈ వ్యక్తి (సల్మాన్) కాంగ్రెస్‌కు కీలక ప్రచారకుడా? కాశ్మీర్‌కు చెందిన ఇతను కాశ్మీర్‌కు స్వేచ్ఛ కావాలంటాడు.. భారతీయ సైనికులను రేపిస్టులంటాడు.. ప్రతి ఇంటా ఓ అఫ్జల్ గురు ఉదయించాలంటాడు.. అఫ్జల్ గురుకు మన కోర్టులు ఉరిశిక్ష విధించాయి.. ప్రతి ఇంట్లో అఫ్జల్ ఉండాలా? అందుకు గుజరాతీలు అనుమతిస్తారా?’ అని మోదీ ఆవేశంగా అన్నారు. రాహుల్‌తో పాటు ప్రచారంలో పాల్గొంటున్న ఇలాంటి వ్యక్తులను మనం ఆదరించాలా? సైన్యాన్ని కించపరచిన వాడిని క్షమించాలా? అని ఆయన ప్రశ్నించారు. తాను భరతమాత పుత్రుడినని, తుది శ్వాస వరకూ దేశసేవ చేస్తానన్నారు. మరో సభలో మోదీ ప్రసంగిస్తూ, తాను వెనుకబడిన కులంలో పుట్టినందుకే తనను ‘నీచ్ ఆద్మీ’ అంటూ మణిశంకర్ వ్యాఖ్యానించారని అన్నారు. వెనుకబడిన కులాల్లో పుట్టినవారు ఎలాంటి ఉపయోగం లేనివారా? అని ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన నేతలను, పార్టీలను గుజరాత్ ప్రజలు తిరస్కరించాలని పిలుపునిచ్చారు.
పటేదార్లకు ‘కోటా’ అమలెలా చేస్తారు?
గుజరాత్‌లో పటీదార్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు అమలు చేస్తామన్న కాంగ్రెస్ హామీ ఎలా అమలవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల నుంచి లాక్కుని పటీదార్లకు రిజర్వేషన్లు ఇస్తారా? లేక పలు రాష్ట్రాల్లో ముస్లింలకు రిజర్వేషన్ల మాదిరి ఇది కూడా తప్పుడు హామీగా మారుతుందా? అని ఆయన శనివారం గుజరాత్ ఎన్నికల ప్రచారం సందర్భంగా లూనావద వద్ద జరిగిన బహిరంగ సభలో అన్నారు. ‘ఇతరుల ‘కోటా’ నుంచి కొంత లాక్కోవాలి లేదా కాంగ్రెస్ చెబుతున్నదంతా అబద్ధం అని భావించాలి..’ అని ఆయన పేర్కొన్నారు. పటీదార్లకు రిజర్వేషన్ల అంశంపై తొలిసారిగా మోదీ ఎదురుదాడి ప్రారంభించారు. పటీదార్లకు రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న హార్థిక్ పటేల్ గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతునిస్తున్న సంగతి తెలిసిందే. తప్పుడు హామీలను నమ్మవద్దని మోదీ గుజరాత్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ‘కాంగ్రెస్ అధికారంలో ఉండగా అన్ని లాలీపాప్‌లు ఇచ్చినట్లు అన్ని రాష్ట్రాల్లో ముస్లింలకు రిజర్వేషన్లను ప్రకటించింది.. కానీ, ఏ రాష్ట్రంలోనైనా అవి అమలు జరిగాయా?’ అని ఆయన ముస్లింలను ఉద్దేశించి ప్రశ్నించారు.

చిత్రం..లూనావదలో బీజేపీ ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ