జాతీయ వార్తలు

‘దంగల్’ ఫేమ్ జైరాకు లైంగిక వేధింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 10: అమీర్‌ఖాన్ బ్లాక్‌బస్టర్ సినిమా ‘దంగల్’లో నటించిన జైరా వాసిమ్‌కు చేదు అనుభవం ఎదురైంది. కాశ్మీర్‌కు చెందిన ఈ టీనేజ్ నటి ఢిల్లీ నుంచి ముంబయికి విమానంలో వస్తుండగా తనకు జరిగిన లైంగిక వేధింపులను ఇంస్టాగ్రామ్‌లో నేరుగా తెలియజేసింది. శనివారం రాత్రి విస్తారా విమానంలో ఢిల్లీ నుంచి ముంబయికి వస్తుండగా తన వెనుక సీట్లో కూర్చున్న ఓ మధ్య వయస్కుడు తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని కన్నీటిపర్యంతమైంది. రెండుగంటల పాటు సాగిన ప్రయాణంలో ఎన్నోసార్లు ముందున్న తన సీట్లో కాళ్లుపెట్టి తన శరీర భాగాలకు తగిలించాడని, ఒకటి రెండుసార్లు తన మెడభాగాన్ని తాకే ప్రయత్నం చేశాడని పేర్కొంది. అదేమని ప్రశ్నించగా, విమానం కుదుపుల వల్ల జరిగినట్లు వివరణ ఇచ్చాడు. కాని అతడు కావాలనే తనను వేధింపులకు గురిచేశాడని, అతని ఫోటో తీద్దామని ప్రయత్నించినప్పటికీ విమానంలో వెలుతురు సరిగా లేకపోవడంతో సరిగా రాలేదని వివరించింది. ఈ విషయాలు తెలుపుతూ జైరా తీవ్రమైన భావోద్వేగానికి గురైంది. ఈ సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, ఇటువంటి సమయాల్లో మనల్ని మనమే సంరక్షించుకోవాలని, ఎవరూ ఎటువంటి సహాయం చేయరని తనలా వేధింపులకు గురియ్యేవారికి సూచించింది. ఈ వీడియో చూసిన వెంటనే మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ విజయ రాహత్‌కర్ తీవ్రంగా స్పందించారు. ఈ సంఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విమానంలో వేధింపులకు గురైన జైరాకు విస్తారా సిబ్బంది ఎటువంటి సహాయం చేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణించాలని పేర్కొన్నారు. జైరాకు మేము అండగా ఉంటాం. ఆమెకు న్యాయం జరిగేలా పోరాటం చేస్తామని అన్నారు. ఇలావుండగా జైరా విడిది చేసిన హోటల్‌కు మహిళా పోలీసులను పంపి విచారణ చేపట్టినట్లు ముంబయిలోని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు సహర్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సంఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని, విమానంలో జైరా వాసిమ్ వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి వివరాలు విస్తారా సంస్థ నుంచి సేకరిస్తామని తెలిపారు.