జాతీయ వార్తలు

మా భవిత పట్టదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోద్రా (గుజరాత్), డిసెంబర్ 10: పదిహేను సంవత్సరాల క్రితం హింసాకాండతో అట్టుడికిన గోద్రా ప్రాంతా ప్రజలు ఇప్పుడు శాంతిని, ఉపాధిని, ఆశావహమైన భవితను కోరుకుంటున్నారు. గతానికి స్వస్తి పలికి భవిష్యత్‌పైనే ఆశలు పెంచుకుని ఉపాధి, ఉద్యోగాలే ధ్యేయంగా సాగాలనుకుంటున్నారు. 2002లో జరిగిన అల్లర్ల నీడలు ఇంకా వెంటాడుతున్నప్పటికీ, వాటినే తలచుకుని నిరాశామయంగా ఉండటం కంటే బలమైన భవితను నిర్మించుకునే దిశగా సమిష్టిగా ముందుకు సాగాలన్న బలమైన ఆకాంక్ష వీరిలో కనిపిస్తోంది. ఇప్పుడు అందరినోటా ఉద్యోగాలు, రోజువారీ సమస్యగా మారిన విద్యుత్ కోతలు, పేలవంగా ఉన్న వౌలిక సదుపాయాల కల్పనే ప్రధానంగా వినిపిస్తోంది. రెండో దశ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటున్న గోద్రావాసులకు తమ గురించి ఏ రాజకీయ నాయకుడూ మాట్లాడకపోవడం అన్నది విస్మయానే్న కలిగిస్తోంది. తమ ప్రాంత అభివృద్ధి, ఇక్కడి ప్రజల అవస్థల గురించిగానీ రాజకీయ నేతలెవరూ తమతమ ప్రసంగాల్లో చెప్పడం లేదన్న భావనా వీరిలో కనిపిస్తోంది. ఇప్పటి వరకూ జరిగిన అన్ని ఎన్నికల్లోనూ రాజకీయ పార్టీ నేతలనోట గోద్రా అల్లర్లే ప్రధానంగా వినిపించేవని, ఇప్పుడు ఆ ఊసు లేకపోవడం తనకెంతో ఆనందాన్ని కలిగిస్తోందని ఇక్కడ మోటారు మెకానిక్ ఆసిం అంటున్నాడు. అయితే అత్యంత ప్రధానమైన తమ ప్రాంతాన్నిగాని, తమ సమస్యల గురించిగానీ నేతలు ప్రస్తావించకపోవడం తమను అవమానించినట్టేనన్న భావనా 30ఏళ్ల ఆ మెకానిక్‌లో కనిపించింది. కాంగ్రెస్ కంచుకోటగావున్న గోద్రా నియోజకవర్గంలో ఇప్పుడు ముఖాముఖి పోటీ జరుగుతోంది. ఇక్కడ కాంగ్రెస్ తరఫున రాజేంద్ర పటేల్ పోటీ చేస్తున్నారు. అలాగే, ఒకప్పుడు కాంగ్రెస్‌లోనేవున్న ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్సీ సికె రౌల్జీ బీజేపీ తరఫున పోటీ చేస్తున్నాడు. అలాగే, ఈ పోటీలో బీజేపీ తిరుగుబాటు అభ్యర్థి జస్వంత్ ఫార్మర్ కూడా ఉన్నారు. ఈయన నామినేషన్ కారణంగా కాంగ్రెస్, బీజేపీ ఓట్లు చీలిపోయే అవకాశం ఉందన్న వాదనా వినిపిస్తోంది. 2007 నుంచీ కూడా ఈ నియోజకవర్గంలో బీజేపీ గెలవకపోవడం వల్ల ఈసారి ఎలాగైనా ఈ కీలక నియోజకవర్గాన్ని చేజిక్కించుకోవాలన్న పట్టుదలతో పనిచేస్తోంది. 1990 నుంచీ గోద్రా నుంచే పోటీ చేస్తున్న రౌల్జీకి ఈ ప్రాంత ప్రజలతో బలమైన సంబధాలు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ కూడా తమ అభ్యర్థి రాజేంద్ర పటేల్ విజయం పట్ల గట్టి నమ్మకానే్న వ్యక్తం చేస్తోంది. 50వేలకు పైగావున్న ముస్లిం ఓట్లతోపాటు ఇతర వర్గాలకు చెందిన ఓట్లు కూడా తమకే పడతాయన్న ధీమా ప్రదర్శిస్తోంది.