జాతీయ వార్తలు

మీడియా కౌన్సిల్ ఏర్పాటు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: ప్రస్తుతం ఉన్న ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానంలో మీడియా కౌన్సిల్‌ను ఏర్పాటు చేస్తూ కేంద్రం చట్టం తీసుకురావాలని నేషనల్ అలయెన్స్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఎన్‌ఏజే) డిమాండ్ చేసింది. ఇటీవలికాలంలో పత్రికా రంగం, పత్రిగా సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై ఎన్‌ఏజే నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టు సంఘాల నాయకులు ఆదివారం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పలు తీర్మానలు చేయడంతోపాటు ఎన్‌ఏజే నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. పాత్రికేయులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జర్నలిస్టుల రక్షణ చట్టం, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానంలో మీడియా కౌన్సిల్‌ను ఏర్పాటుచేస్తూ చట్టం చేయాలని తీర్మానం చేసింది. అలాగే ప్రస్తుతం సమాజంలో పాత్రికేయుల స్థితిగతులపై అధ్యయం చేసి నూతన వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలని, ఆరోగ్య భద్రత కల్పించే విధంగా వర్కింగ్ జర్నలిస్ట్ చట్టానికి సవరణలు చేయాలని తీర్మానం చేసింది.