జాతీయ వార్తలు

బాధ్యత లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: పవిత్ర యమునా నదీ తీరానికి విఘాతం కలిగేలా సాంస్కృతిక కార్యమ్రాలకు ఎలా అనుమతులిస్తారు. మీకు బాధ్యత లేదా? అంటూ ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి (డిపిసిసి)పై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీరు అనుసరిస్తున్న విధానం చట్టపరిధిలో లేదు’ అంటూ ఎన్‌జిటి చైర్‌పర్సన్ జస్టిస్ స్వతంత్ర కుమార్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. గత ఏడాది యమునా తీరంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ పెద్దఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం తెలిసిందే. పర్యావరణ చట్ట పరిమితుల ప్రకారం యమునా తీరంలో ఇలాంటి కార్యక్రమాల నిర్వహణకు డీపీసీసీ ఎలా అనుమతి ఇచ్చిందంటూ యమునా పరిరక్షణ ఉద్యమకర్త మనోజ్ మిశ్రా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ఎన్జీటీ ‘్భమి, నీరు, గాలి, ప్రకృతి వనరుల పరిరక్షణ మీ ప్రాథమిక బాధ్యత. పర్యావరణానికి విఘాతం కలిగించే ఎలాంటి కార్యక్రమాలకూ అనుమతులు ఇవ్వకూడదు. ఈ విషయంలో చట్ట పరిధులు దాటి వ్యవహరించారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘అంత పెద్దఎత్తున నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమానికి అనేకమంది హాజరవుతారు. అలాంటపుడు సహజంగానే పర్యావరణానికి విఘాతం కలిగించే ప్లాస్టిక్, సివేజ్‌లాంటి చెత్త పెద్దఎత్తున పేరుకుంటుంది. అలా జరుగుతుందని తెలిసీ అనుమతులు ఇచ్చారంటే చట్ట పరిధులు దాటి వ్యవహరించినట్టే’నని ఎన్జీటీ వ్యాఖ్యానించింది. కేసుపై సుదీర్ఘ తీర్పునిస్తూ ‘అక్కడ జరిగిన పర్యావరణ నష్టానికి ఆర్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ బాధ్యత వహించాలి’ అని వ్యాఖ్యానించింది. జరిగిన నష్టానికి అదనపు పరిహారం విధించాలన్న వాదనను తిరస్కరిస్తూ, ఇప్పటికే ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ డిపాజిట్ చేసిన ఐదు కోట్ల సొమ్ముతో యమునా తీరంలో పర్యావరణహిత కార్యక్రమాలు చేపట్టాలని ఢిల్లీ అభివృద్ధి సంస్థను ఆదేశించింది. ఇంకా ఏమైనా సొమ్ము మిగిలితే మాత్రమే బిల్లులు సహా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్‌కు తిరిగి ఇవ్వాలని సూచించింది. యమునా నదీ పరీవాహక ప్రాంతాన్ని పరిరక్షించాలని, భవిష్యత్‌లో మరోసారి ఇలాంటి కార్యక్రమాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వకూడదని డిడిఏను గట్టిగా ఆదేశించింది. నదీ పరీవాహన ప్రాంత పరిరక్షణకు నిపుణులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, సత్వర చర్యలపై సిఫార్సులు తీసుకోవాలని కూడా ఆదేశించింది.
అయితే, ఎన్జీటీ ఆదేశాలపై స్పందించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ‘అననుకూల, ఆమోదయోగ్యంకాని’ తీర్పుగా దీన్ని అభివర్ణించింది. ఎన్జీటీ తీర్పుపై తాము సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ప్రకటించింది.