జాతీయ వార్తలు

బోర్డు ఆదేశాలను పాటిస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: కృష్ణానదీ జలాలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కేటాయింపులు చేసేందుకు ఏర్పాటుచేసిన జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబునల్ విచారణ మంగళవారానికి వాయిదా పడింది. సోమవారాం ఆంధ్రా తరపు సాక్షిగా ఉన్న సాగునీటి రంగ నిపుణుడు కేవీ సుబ్బారావును తెలంగాణ తరపు న్యాయవాది వైద్యానాథన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటి వినియోగంలో కృష్ణా బోర్డు ఆదేశాలను ఆంధ్రా పాటిస్తున్నదా? అని ప్రశ్నించారు. శ్రీశైలం రిజర్వాయర్ కృష్ణానదీ యాజమాన్య బోర్టు పరిధిలోనే ఉందని, పాక్షికంగా రిజర్వాయర్‌ను ఆంధ్రా నియంత్రించినా నీటి వినియోగంపై బోర్డు ఆదేశాలనే పాటిస్తున్నామని సుబ్బారావు సమాధానం ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో నీటి వినియోగానికి సంబంధించి ఆపరేషన్ మాన్యువల్ అమలులోఉండేదని, ఇప్పుడు రిజర్వాయర్ పరిధితో నీటిని వినియోగిస్తున్నారని చెప్పారు. నల్లరేగడి నేలల్లో పంట సాగును పంట కాలం తగ్గించుకోవడం వల్ల నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువల్లో 26 టిఎంసిలను ఆదాచేయవచ్చును కదా అన్న ప్రశ్నకు... సుబ్బారావు సమాధానం ఇస్తూ దీనికి తమకు అంగీకారం కాదని పేర్కొంటూ, పంటకాలం అనేది నేల స్వభావంపై, పండించే పంటపై అధారపడి ఉంటుందని చెప్పారు.
తెలంగాణ తరపు న్యాయవాది అడిగిన పలు ప్రశ్నలకు ఏపీ తరపు సాక్షిగా ఉన్న సుబ్బారావు సమాధానం ఇచ్చారు. అయితే తెలంగాణ తరపు సాక్షిగా సిడబ్ల్యూసి మాజీ చీఫ్ ఘన్‌శ్యాంఝాను ఆంధ్రప్రదేశ్ ట్రిబ్యునల్ క్రాస్‌ఎగ్జామినేషన్ చేసుకోవచ్చునని తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ట్రిబ్యునల్‌లో మంగళవారం కూడా క్రాస్‌ఎగ్జామినేషన్ కొనసాగుతుంది.