జాతీయ వార్తలు

15న ముంబయిలో ఇంద్రజాలికుల సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 11: ఇందజాలాన్ని కళగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 15న ముంబయి మహా నగరంలో ‘జాదూ ఉత్సవ్’పేరిట ఓ సమావేశం జరుగుతోంది. అలాగే ఇంద్రజాలికులకు సంక్షేమ కార్యక్రమాలు అమలుచేయడంతోపాటు కళను పరిరక్షించడానికి చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ ఆఫ్ ఇల్యూసియోనిస్ట్ అండ్ మెజీషియన్స్ (ఏఐఎం) కోరుతోంది. జాదూ ఉత్సవ్‌కు దేశం నలుమూలల నుంచి 250 మంది ఇంద్రజాలికులు హాజరవుతారని ఏఐఎం అధ్యక్షుడు అతుల్ పటేల్ వెల్లడించారు.‘ ఇంద్రజాలం కూడా కళే. ఆ విషయాన్ని ప్రకటించడానికి ప్రభుత్వాలు వెనకాడుతున్నాయి. పూర్వం నుంచి ఇంద్రజాలం ఉంది. ప్రభుత్వం ప్రోత్సహం లేక ఆ కళ ఉనికినే కోల్పోయే ప్రమాదం ఏర్పడింది’అని ఆయన స్పష్టం చేశారు.