బిజినెస్

16న ఎయిర్ ఫోర్స్ అకాడమీలో పాసింగ్ ఔట్ పరేడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 11: ఈ నెల 16న దుండిగల్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్, గ్రాండ్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పాసింగ్ ఔట్ పరేడ్‌కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఎయిర్ ఫోర్స్ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబ పరమ విశిష్ఠ సేవా మెడల్, అతి విశిష్ఠ సేవా మెడల్స్ ప్రదానం చేయనున్నట్టు ఐడె-డి- క్యాంప్‌లో సోమవారం నావల్ అధికారుల సమీక్ష సమావేశంలో తెలిపారు. రాష్టప్రతి తరఫున హాజరయ్యే ముఖ్య అతిథి ఈ అవార్డులను బహూకరిస్తారని ఎయిర్ ఫోర్స్ అకాడమీ తెలిపింది. 200వ, ట్రోఫీ బహూకరణ, పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమానికి శిక్షణ పొందిన అధికారులతో పాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది, కుటుంబీకులు పాల్గొంటారని తెలిపారు. ప్రతి ఏటా జనవరి, జూలై మాసాల్లో ఈ అధికారులకు ఈ శిక్షణ ఉంటుందని తెలిపారు. ఇందుకు సంబంధించి రిహార్సల్స్ కూడా జరిగినట్టు అకాడమీ పేర్కొంది.

చిత్రం..హైదరాబాద్ దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్న కేడెట్లు