జాతీయ వార్తలు

95వ ఏట దిలీప్‌కుమార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 11: బాలీవుడ్ నట దిగ్గజం దిలీప్‌కుమార్ సోమవారం నాడు 95వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. అనారోగ్యం నుంచి కోలుకోవడంతో ఈ ఏడాది ఆయన జన్మదినాన్ని కుటుంబ సభ్యులు, అశేష అభిమానులు వేడుకగా జరుపుకున్నారు. ‘ఆయన ఆరోగ్యం కుదుటపడింది.. అల్లా దయ వల్ల అంతా బాగానే ఉంది.. ఆయనకు సంబంధించిన తాజా ఫొటోను వారంలోగా విడుదల చేస్తాం..’ అని దిలీప్ భార్య సైరాబాను ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కొన్ని తరాల తరబడి ఎంతోమంది నటులను ప్రభావితం చేసిన మేటి నటుడు దిలీప్ కుమార్ ఆరోగ్యం కొన్నాళ్ల క్రితం క్షీణించిన సంగతి తెలిసిందే. ఆరోగ్యం మెరుగుపడడంతో దిలీప్ తోబుట్టువులు, బంధుమిత్రులు కలుసుకుని ఈ ఏడాది ఆనందత్సోహాల మధ్య గడిపారని సైరాబాను తెలిపారు. దిలీప్ అభిమానులకు, శ్రేయోభిలాషులకు నిజంగా ఇది పండుగ రోజు అన్నారు. ఏటా దిలీప్ జన్మదినాన్ని ఘనంగా జరపాలని అనుకుంటున్నా, అనారోగ్యం వల్ల సందర్శకులను భారీగా అనుమతించరాదని వైద్యులు ఆంక్షలు విధించేవారని ఆమె పేర్కొన్నారు. అయితే, దిలీప్ కోలుకోవడంతో ఈ ఏడాది ఆ పరిస్థితి లేదన్నారు. అవార్డుల కన్నా అభిమానుల ప్రశంసలే ముఖ్యమని దిలీప్ తన ఆత్మకథలో పేర్కొన్నారని గుర్తుచేశారు.