జాతీయ వార్తలు

10మంది దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీర్జాపూర్/లక్నో, డిసెంబర్ 11: ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో మరిహాన్‌లోని కృషి విజ్ఞాన్ కేంద్రం వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతిచెందారు. నలుగురు గాయపడ్డారు. ఒక ట్రక్‌ను ట్రాక్టర్ ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. సీతాలాధమ్ ఆలయంలో జరుగుతున్న జాతరకు జనాన్ని తీసుకెళ్లి తిరిగి వస్తున్న ట్రాక్టర్ ట్రాలీ ఓ ట్రక్‌ను బలంగా ఢీకొందని మీర్జాపూర్ ఎస్పీ అశీష్ తివారీ వెల్లడించారు. ఐదుగురు వ్యక్తులు సంఘటనా స్థలంలోనే చనిపోయారన్నారు. మిగతావారు ఆసుపత్రికి తరలించగా మరణించారు. మృతులను గుర్తించినట్టు ఎస్పీ తెలిపారు. అఖిలేశ్ (16), గారియా (12), నేహా (13), రీనా (15), సుష్మా (18), హేమ (17), అనిత (29), మంజూదేవి (30), శ్యామ్ మురారీ (10), నూరే (25) దుర్మరణం చెందారు. నూరే ట్రక్‌లో ప్రయాణిస్తుండగా మిగతావారంతా ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్నారని ఎస్పీ పేర్కొన్నారు. ఘోర ప్రమాదం పట్ల యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షలు, గాయపడ్డవారికి 25వేల ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందజేయాలని సీఎం ఆదేశించారని లక్నోనుంచి అధికార వర్గాలు వెల్లడించాయి.