జాతీయ వార్తలు

పోలవరంపై పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: పోలవరం ప్రాజెక్టు పరిధిలో మానవ హక్కుల ఉల్లంఘన యధేచ్చగా సాగుతోందని, దీని వ్యవహారంలో జోక్యం చేసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు సోమవారం తోసిపుచ్చింది. పురుషోత్తపట్నం ఎత్తిపోతల నిర్మాణానికి అర్ధరాత్రి సమయంలో అక్కడ స్థానికులను బలవంతంగా ఖాళీ చేయించారని, దీనిపై జాతీయ మానవ హక్కుల సంఘం స్వతంత్ర విచారణ చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ చౌదరయ్య సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ జస్టిస్ ఎకే సిక్రీతో కుడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈ విషయంలో జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించాలని పేర్కొంటూ, సుప్రీంకోర్టు విచారణను తిరస్కరించింది.